పాకిస్తాన్ అమ్మాయి సపోర్ట్ మనకే

పాకిస్తాన్ అమ్మాయి సపోర్ట్ మనకే

జమ్మూకశ్మీ ర్‌ లోని పుల్వామా టెర్రర్‌ అటాక్‌ వెనక తన హస్తంలేదని పాకిస్థాన్‌ చెబుతున్నవేళ…ఆ దేశానికి  చెందిన యువతి మాత్రం సోషల్‌‌‌‌‌‌‌‌ మీడియాలో 40 మంది జవాన్లను పొట్టన పెట్టుకున్నఘటనను తీవ్రంగా ఖండించిం ది. టెర్రర్‌ అటాక్‌ ను ఖండిస్తూ ఇండో- పాక్‌ శాంతి కార్యకర్త, యంగ్‌ జర్నలిస్ట్  షెహిర్‌ మీర్జా తన ఫేస్‌ బుక్‌ లో పెట్టిన పోస్ట్​ఇప్పుడు వైరల్‌ ‌‌‌‌‌‌‌గా మారిం ది.‘‘నేను పాకిస్థానీ. అయినా పుల్వామా  ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నాను’’ #యాం టీ హేట్‌ చాలెంజ్‌ # నో టు వార్‌ అంటూనే ‘‘దేశభక్తి కోసం మానవత్వాన్ని వ్యాపారంగా  మార్చడానికి  నేను ఇష్టపడను’’ అని ఓ పిక్చర్‌ మెసేజ్‌ పెట్టిం ది. కాశ్మీ ర్‌ అంశంపై పాకిస్థాన్‌ ప్రభుత్వ విధానానికి ఎంత మాత్రం  మద్దతివ్వబోనని మీర్జా స్పష్టం చేసిం ది. పాకిస్థానీలు ధైర్యం గా తమ గొంతు వినిపించడానికి ఇదే తగిన సమయమని ‘ఆమ్‌ కి ఆషా’ ఫేస్‌ బుక్‌ గ్రూప్‌ లోనూ ఓ మెసేజ్‌ పోస్ట్‌ చేసిం ది.‘‘కాశ్మీర్‌ లో అమాయకులు ప్రాణాలు కోల్పో యినందుకు మేంఎంతగానో కలతచెందాం . ఇలాం టి కష్ట సమయంలో యుద్ధం, టెర్రరిజానికి వ్యతిరేకంగా ప్రజలు తమ గొంతు విప్పాలి . టెర్రర్‌ అటాక్‌ ను ఖండిం చడం మాత్రమే కాదు, ఇండియన్‌ ఫ్రెండ్స్‌‌‌‌‌‌‌‌కు మద్దతు చెప్పడానికి  కూడా #యాం టీ హేట్‌ చాలెంజ్‌ # ప్రారంభించాం ’ అని మీర్జా చెప్పా రు.‘‘మా ఫీలింగ్స్‌‌‌‌‌‌‌‌ అర్థం చేసుకున్న పాకిస్థానీయులు కూడా దీంట్లో చేరాలి’’ అని పిలుపునిచ్చారు. పుల్వామా అటాక్‌ కు తానే కారణమని పాక్‌ లో తిష్ట వేసిన జైషే మహ్మద్‌‌‌‌‌‌‌‌ గ్రూప్‌ స్వయంగా ప్రకటిం చినా ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ మాత్రం.. దాడికి ఆధారాలు చూపిస్తే  బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుం టానని ప్రకటిం చడంతో… టెర్రర్‌ మూలాలు తెలిసిన మీర్జా లాంటి స్వతంత్ర భావాలున్నవారు.. సొంత దేశమని కూడా చూడకుం డా నిజాన్ని నిర్భయంగా ప్రపంచానికి  చాటిచెబుతున్నారు.