జమ్మూలో డ్రగ్స్ స్మగ్లర్ కాల్చివేత..4 కిలో ల నార్కోటిక్స్ స్వాధీనం

జమ్మూలో  డ్రగ్స్ స్మగ్లర్ కాల్చివేత..4 కిలో ల నార్కోటిక్స్ స్వాధీనం

జమ్మూలోని రామ్ గఢ్ సరిహద్దుల్లో చొరబాటుకు యత్నించిన పాకిస్తానీ డ్రగ్స్ స్మగ్లర్ ను  BSF దళాలు మట్టుబెట్టాయి. స్మగ్లర్ మృతదేహంతో పాటు పట్టుబడ్డ 4 కిలోల నార్కోటిక్ డ్రగ్ ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. జూలై నెలలో వరస అక్రమ చొరబాటు పెరుగుతుండటంతో భద్రతా దళాలు అప్రమత్తమయ్యాయి.జూలై 19న BSF దళాలు, జమ్మూ కాశ్మీర్ పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన జాయింట్ ఆపరేషన్ కుప్వారాలోని మచ్చల్ సెక్టార్లో చొరబాటు దారుల యత్నాన్ని భద్రతా దళాలు తిప్పికొట్టాయి.  ఎన్ కౌంటర్లలో ఇద్దరు ఉగ్రవాదులను హతమయ్యారు. 4 AK రైఫిల్స్, 6 హ్యాండ్ గ్రెనేడ్లు, ఇతర యుద్ధ తరహా స్టోర్లను స్వాధీనం చేసుకున్నట్లు భద్రతాదళాలు తెలిపాయి. 

ఇదిలా ఉండగా మరో ఘటనలో జూలై 18న రాత్రి అనంత్‌నాగ్‌లో ఇద్దరు కూలీలపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఘటనానంతరం గాయపడిన పౌరులిద్దరినీ జమ్మూ కాశ్మీర్ పోలీసులు ఆస్పత్రికి తరలించారు. అనంతరం అనంత్ నాగ్ లో సెర్చ్ ఆపరేషన్ నిర్వహించినట్లు జమ్మూ పోలీసులు.