
పహల్గాం టెర్రరిస్టుల దాడి తర్వాత పాకిస్తాన్ గజగజ వణికిపోతోంది. భారత్ ఎప్పుడు యుద్ధం మొదలు పెడుతుందో.. ఏ క్షణంలో విరుచుకు పడుతుందోనని నిద్రలేని రాత్రులు గడుపుతోంది. బైసరన్ లోయలో 26 మంది అమాయకుల ప్రాణాలు తీసిన పాక్ టెర్రరిస్టులకు బుద్ధి చెప్పేందుకు.. అదే సమయంలో ఉగ్రవాదులను పెంచి పోషిస్తున్నందుకు ఆ దేశానికి తగిన గుణపాఠం చెప్పాలని భారత్ నిర్ణయించుకుంది. అందులో భాగంగా త్రివిధ దళాలను అలర్ట్ చేసింది భారత ప్రభుత్వం.
ఇప్పటికే సరిహద్దు ప్రాంతంలో సైన్యాన్ని పెంచుకుంది భారత్. దీనికి తోడు గుజరాత్ తీరప్రాంతమైన అరేబియా సముద్రంలో నేవీ డ్రిల్స్ చేపట్టింది. నౌకాదళాలు పాకిస్తాన్ కు కేవలం 85 మైళ్ల దూరంలో డ్రిల్ చేపట్టడంతో యుద్ధం తొందర్లోనే మొదలయ్యే లా ఉంది.. భారత్ మా పైన ఏ క్షణమైనా దాడికి దిగవచ్చునని పాక్ అధికారులే ప్రకటించడం చూస్తే ఆ దేశం ఎంత భయంలో ఉందో అర్థమవుతోంది.
Also Read : జాతీయ రహదారులపై MIG 29 యుద్ధ విమానాల ల్యాండింగ్
భారత్ ఈ సారి చేసే దాడి చాలా తీవ్రంగా ఉందనే ఉంటుందనే భయాలతో పాకిస్తాన్ అమెరికా ముందు మోకరిల్లింది. భారత్ ను నిలువరించాల్సిందిగా యూఎస్ అధ్యక్షుడు ట్రంప్ ను వేడుకుంది. యుద్ధ ఆపేందుకు చొరవతీసుకోవాలని యూఎస్ లో ఉన్న పాక్ దౌత్యవేత్త రిజ్వాన్ సయీద్ షేక్ ట్రంప్ ను కోరారు. పెద్దన్న పాత్రలో అమెరికా జోక్యం చేసుకోవాలని.. శాంతిని కోరుకునే దేశంగా అమెరికా భారత్ చర్చలు జరపాలని ఆయన కోరారు. ఇరు దేశాలు అనుబాంబులు కలిగి ఉన్నందున.. యుద్ధానికి వెళ్తే నష్టం తీవ్రంగా ఉంటుందని., ఈ విషయంలో ట్రంప్ జోక్యం చేసుకోవాలని ఆయన న్యూస్ వీక్ మ్యాగజైన్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.