పాక్ కొత్త ఆర్మీ చీఫ్గా ఆసిమ్ మునీర్

పాక్ కొత్త ఆర్మీ చీఫ్గా ఆసిమ్ మునీర్

పాకిస్తాన్ కొత్త ఆర్మీ చీఫ్ గా లెఫ్టినెంట్ జనరల్ ఆసిమ్ మునీర్ త్వరలోనే నియమితులు కానున్నారు. ఆయన గతంలో పాక్ నిఘా సంస్థ ఐఎస్ఐ కు చీఫ్ గానూ బాధ్యతలు నిర్వర్తించారు. ప్రస్తుతం ఆర్మీ చీఫ్ గా ఉన్న ఖమర్ జావెద్ బజ్వా నుంచి ఆసిమ్ డిసెంబరు మొదటివారంలో బాధ్యతలు స్వీకరించనున్నారు. 

దాదాపు గత ఆరేళ్లుగా ఆర్మీ చీఫ్ గా వ్యవహరిస్తున్న ఖమర్ జావెద్ బజ్వా డిసెంబరు మొదటివారంలో పదవీ విరమణ చేయనున్నారని పాక్ రక్షణ మంత్రి ఖాజా ఆసిఫ్ వెల్లడించారు. ప్రతిభ, చట్టం, రాజ్యాంగాన్ని అనుసరించి కొత్త ఆర్మీ చీఫ్ ను నియమిస్తున్నామని స్పష్టం చేశారు. 

ఈనేపథ్యంలో ప్రస్తుత ఆర్మీ చీఫ్ ఖమర్ జావెద్ బజ్వా మాట్లాడుతూ.. పాక్ రాజకీయ పరిణామాల్లో సైన్యం పాత్ర ఏ మాత్రం లేదని తేల్చి చెప్పారు. అమెరికా కుట్ర వల్లే తన ప్రభుత్వం పడిపోయిందని ఇమ్రాన్ ఖాన్ చేసిన ఆరోపణల్లో వాస్తవం లేనే లేదన్నారు. 

17వ ఆర్మీ చీఫ్ గా ఆసిమ్ వచ్చే నెలలో బాధ్యతలు స్వీకరించనున్నారు. 1947 నుంచి ఇప్పటివరకు 17 మంది పాక్ ఆర్మీ చీఫ్ లు అయ్యారు. ఇక ఇదే కాలంలో దాదాపు 30 మంది పాక్ ప్రధానమంత్రులు అయ్యారు.