
ఇస్లామాబాద్: తాలిబన్లు అఫ్గానిస్తాన్‌ను స్వాధీనం చేసుకోవడంపై పాకిస్తాన్ ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్ సమర్థించారు. తాలిబన్లు అఫ్గానిస్తాన్‌ను స్వాధీనం చేసుకోవడం అనేది బానిస సంకెళ్లను తెంచుకోవడం లాంటిదని ఆయన పేర్కొన్నారు. వేరే దేశాల సంస్కృతిని నమ్మడం, దాన్ని అలవర్చుకోవడం అనేది బానిసత్వం కంటే ఘోరమైందని అన్నారు. ఇలాంటి బానిసత్వ మనసుతో నిర్భయంగా ఎలాంటి నిర్ణయాలు తీసుకోలేమని ఇమ్రాన్ ఖాన్ చెప్పారు.