AFG vs PAK: దంచికొడుతున్న ఆఫ్ఘన్ ఓపెనర్లు.. దుఃఖాన్ని ఆపులేకపోతున్న పాక్ టీమ్ డైరెక్టర్

AFG vs PAK: దంచికొడుతున్న ఆఫ్ఘన్ ఓపెనర్లు.. దుఃఖాన్ని ఆపులేకపోతున్న పాక్ టీమ్ డైరెక్టర్

చెన్నై లాంటి పిచ్ మీద 282 పరుగులు చేసి విజయంపై ధీమాగా ఉన్న పాకిస్థాన్ జట్టులో టెన్షన్ మొదలైంది. భారీ లక్ష్య ఛేదనలో ఆఫ్ఘనిస్తాన్ ఓపెనర్లు పాక్ బౌలర్లను సమర్ధవంతంగా ఎదుర్కొంటున్నారు. తొలి 10 ఓవర్లలో వికెట్ కోల్పోకుండా 60 పరుగులు చేసి నిలకడగా ఆడుతుంది.ఈ దశలో పాక్ కోచ్ మీకీ ఆర్ధర్ బాధను తట్టుకోలేక సహనం కోల్పోయాడు. 

ఇప్పటికే ఆడిన నాలుగు మ్యాచుల్లో రెండు మ్యాచులు ఓడిన పాకిస్థాన్ కు ఈ మ్యాచ్ ఓడిపోతే సెమీస్ అవకాశాలు సంక్లిష్టంగా మారుతాయి. 283 పరుగుల లక్ష్య ఛేదనలో ఆఫ్ఘన్ ఓపెనర్లు బాగా ఆడుతుండడంతో పాక్ డైరెక్టర్ తట్టుకోలేకపోతున్నాడు. బౌలింగ్ లో విఫలమవడంతో పాటు ఫీల్డింగ్ వైఫల్యాలు ఆర్ధర్ కు చిరాకు పుట్టించాయి. దీంతో పాక్ ప్లేయర్లను తిట్టలేక తనలో తానే మదనపడిపోయాడు. 

కాగా.. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన పాక్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 282 పరుగులు చేసింది. బాబర్ అజామ్ (74),అబ్దుల్లా షఫీక్ (58) అర్ధ సెంచరీలతో రాణించారు. ప్రస్తుతం లక్ష్య ఛేదనలో ఆఫ్ఘనిస్థాన్ 13 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 81 పరుగులు చేసింది. క్రీజ్ లో ఇబ్రహీం జద్రాన్ (44) గర్భాజ్ (37) ఉన్నారు.