ఈవారం కూడా రైతు బిడ్డనే టాప్.. డేంజర్ జోన్లో ఆ ఇద్దరు?

ఈవారం కూడా రైతు బిడ్డనే టాప్.. డేంజర్ జోన్లో ఆ ఇద్దరు?

బిగ్‌బాస్ సీజన్ 7(Bigg boss season7)లో రెండు ఎలిమినేషన్ కు సమయం ఆసన్నం అయ్యింది. మొదటి వారంలో ఇంటినుండి కిరణ్ రాథోడ్(Kiran rathod) ఎలిమినేటి అవగా.. రెండో వారంలో ఎవరూ ఊహించని విధంగా ఇద్దరు కంటెస్టెంట్స్ డేంజర్ జోన్ లో ఉన్నారు. ఆ ఇద్దరిలో ఎవరో ఒకరు ఈ వారం ఇంటి నుండి బయటకు వెళ్లే అవకాశం ఉంది. 

ఇక బిగ్ బాస్ సీజన్ 7లో రెండో వారం నామినేషన్స్ వాడీ వేడిగా జరిగాయి. అందులో ఎక్కువ నామినేషన్ ఓట్లు రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ కు పడ్డాయి. పదే పదే రైతు బిడ్డ అనే సింపతీ వాడుతున్నాడని కంటెస్టెంట్స్ అందరు పల్లవి ప్రశాంత్ పై రెచ్చిపోయారు. అలా మొత్తం ఈ వారంలో ఏకంగా తొమ్మిది నామినేషన్స్ లో ఉన్నారు. అందులో పల్లవి ప్రశాంత్, శివాజీ, గౌతమ్ కృష్ణ, శోభా శెట్టి, , అమర్ దీప్, రతిక, షకీల, టేస్టీ తేజ, యావర్ ఉన్నారు.

Also Read :- పెదకాపు1 కోసం భారీ బడ్జెట్.. కొత్త కుర్రాడిపై అంత అవసరమా?

ఇక రెండో వారం వోటింగ్ చూసుకుంటే.. పల్లవి ప్రశాంత్‌కే ప్రేక్షకుల నుంచి అత్యధిక ఓట్లు పడుతున్నాయి. హౌస్ మేట్స్ అందరు అతడిని ఒక్కడిని చేసి టార్గెట్ చేయడంతో సింపతీ వర్కౌట్ అయ్యింది. దీంతో అతనికే ఎక్కువగా ఓట్లు పడుతున్నాయి. ఇక వోటింగ్ శాతం ప్రకారం చూసుకుంటే.. పల్లవి ప్రశాంత్‍ 39.56 శాతంతో టాప్‍లో ఉండగా.. 20.93 శాతం వోటింగ్ తో రెండో స్థానంలో శివాజీ  నిలిచారు. ఇక అమర్ దీప్ 17.94 శాతం, రతికకు 8.18 శాతం, గౌతమ్ కృష్ణ 3.21 శాతం, యావర్ 3.06 శాతం, శోభా శెట్టి 2.51 శాతం, షకీలకు 2.34 శాతం, టేస్టీ తేజ 2.28 శాతం ఓట్లతో తరువాతి స్థానాల్లో నిలిచారు. ఈ ఓటింగ్ ప్రకారం చూసుకుంటే.. షకీల లేదా టేస్టీ తేజ ఈ వారం ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉంది. అయితే ఈ ఇద్దరిలో టేస్టీ తేజ తో ఇంట్లో ఫన్ జనరేట్ అవుతుంది కాబట్టి షకీలా ఈ వారం ఎలిమినేట్ అవకాశం ఎక్కువగా ఉంది.