పెదకాపు1 కోసం భారీ బడ్జెట్.. కొత్త కుర్రాడిపై అంత అవసరమా?

పెదకాపు1 కోసం భారీ బడ్జెట్.. కొత్త కుర్రాడిపై అంత అవసరమా?

ఫ్యామిలీ చిత్రాల దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల(Srikanth addala) తెరకెక్కిస్తున్న లేటెస్ట్ మూవీ పెదకాపు1(Pedakapu1). రూరల్ పొలిటికల్ డ్రామాగా రానున్న ఈ సినిమా రెండు పార్ట్స్ గా తెరకెక్కనుంది. ఈ సినిమాతో విరాట్ కర్ణ(Virat karrna) అనే కొత్త హీరో తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నాడు. సెప్టెంబర్ 29న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా ట్రైలర్ ను ఇటీవల రిలీజ్ చేశారు మేకర్స్. ఈ ట్రైలర్ ప్రేక్షకుల్లో సినిమాపై అంచనాలను పెంచేసింది. 

అయితే తాజాగా ఈ సినిమా గురించిన ఒక న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అదేంటంటే.. ఈ సినిమా కోసం నిర్మాతలు భారీగా ఖర్చు చేశారట. కేవలం మొదటి పార్ట్ కోసం ఏకంగా రూ.10 కోట్ల వరకు ఖర్చు చేశారట. నిజానికి కొత్త హీరోపై ఇంత భారీగా ఖర్చు చేయడం అంటే మామూలు విషయం కాదు. అలాగే దర్శకుడు శ్రీకాంత్ అడ్డాలకు కూడా ఈ మధ్య పెద్ద హిట్స్ లేవు.

Also Read :- ఒక్కో కుటుంబానికి లక్ష... విజయ్ డబ్బులిచ్చేది వీళ్లకే

మరి ఏ ధైర్యంతో ఈ సినిమాపై ఇంత ఖర్చు చేశారంటే.. ఈ సినిమా హీరో విరాట్ కర్ణ నిర్మాతకు మేనల్లుడు అవుతాడట. అల్లుడి లాంచింగ్ కోసం ఏమాత్రం కాంప్రమైజ్ కాకండా భారీగా ఖర్చు చేశారట. అంతేకాదు.. సినిమా మొత్తం యాక్షన్ తో నడుస్తుంది కాబట్టి.. ఖచ్చితంగా ఘన విజయం సాధిస్తుందని నమ్ముతున్నారట మేకర్స్. ఇక హిందీ యూట్యూబ్ రైట్స్, ఓటిటి రైట్స్ తో చాలా వరకు రికవరీ అయ్యే అవకాశం ఉంటుంది. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొనే మేకర్స్ ఇంత ఖర్చు చేశారని సమాచారం. మరి ఈ సినిమా వారి నమ్మకాన్ని నిలబెడుతుందా? లేదా? అనేది చూడాలి.