Sobhita Dhulipala: ‘‘ఊపిరి ఆపేలా ఉంది.. ఇది మామూలు సినిమా కాదు”.. బ్లాక్‌బస్టర్ ‘ధురంధర్’పై శోభిత ప్రశంసల వర్షం!

Sobhita Dhulipala: ‘‘ఊపిరి ఆపేలా ఉంది.. ఇది మామూలు సినిమా కాదు”.. బ్లాక్‌బస్టర్ ‘ధురంధర్’పై శోభిత ప్రశంసల వర్షం!

బాలీవుడ్‌లో సంచలనం సృష్టిస్తున్న భారీ యాక్షన్-స్పై థ్రిల్లర్ ‘ధురంధర్’(Dhurandhar). బాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రణ్ వీర్ సింగ్ తన కెరీర్ లో అత్యంత భారీ విజయాన్ని ఖాతాలో వేసుకున్నారు. బాక్సాఫీస్ వద్ద కేవలం వసూళ్ల సునామీనే కాదు, భారతీయ సినీ చరిత్రలో సరికొత్త రికార్డులను సృష్టించింది. ఈ చిత్రం ప్రతిష్టాత్మకమైన రూ.1000 కోట్ల క్లబ్‌లో చేరి వసూళ్ల పరంపరను కొనసాగిస్తోంది. ఈ క్రమంలోనే ‘ధురంధర్’ చూసిన సినీ స్టార్స్ తమ రివ్యూలను షేర్ చేస్తూ మరింత హీట్ పెంచుతున్నారు. ఇటీవలే, అల్లు అర్జున్ సైతం సినిమా చుసిన ఫిదా అయ్యానంటూ ట్వీట్ చేసి అంచనాలు పెంచాడు.

‘ధురంధర్’పై శోభిత ప్రశంసల వర్షం:

లేటెస్ట్గా నాగ చైతన్య వైఫ్, బ్యూటీఫుల్ హీరోయిన్ శోభిత ధూళిపాళ్ల ‘ధురంధర్’పై ప్రశంసల వర్షం కురిపించింది. ‘ధురంధర్’ మూవీని చూసిన అనంతరం, శోభిత తన ఇన్‌స్టాగ్రామ్ వేదికగా స్పందిస్తూ ఫిదా అయ్యానని తెలిపింది. “వావ్.. వావ్.. వావ్.. ఉత్కంఠభరితమైనది. మైండ్ బ్లోయింగ్. స్ఫూర్తిదాయకం. ధురంధర్ నిజంగా ఊపిరి ఆపేలా ఉంది. ప్రతి ఫ్రేమ్‌ కూడా అద్భుతంగా రూపొందించారు. ఆదిత్య, రణ్‌వీర్ అదరగొట్టారు.. సారా అర్జున్ ఎంత ప్రతిభ, ఏం అందం. ఇది మామూలు సినిమా కాదు” అంటూ శోభిత ట్వీట్ చేశారు.

ముఖ్యంగా దర్శకుడు ఆదిత్య ధర్ విజన్‌ను ఆమె ప్రత్యేకంగా మెచ్చుకున్నారు. అలాగే హీరో రణవీర్ సింగ్ నటన, పాత్రలో లీనమైన తీరు తనను ఆశ్చర్యపరిచిందని పేర్కొన్నారు. శోభిత చేసిన ఈ ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పలువురు నెటిజన్లు, సినీ ప్రముఖులు ఆమె అభిప్రాయానికి మద్దతు తెలుపుతూ కామెంట్లు చేస్తున్నారు.

కలెక్షన్ల ప్రవాహం

భారతీయ సినిమా గర్వించదగ్గ మైలురాయిని 'ధురంధర్' చేరుకుందని మేకర్స్ సోషల్ మీడియా వేదికగా తెలిపింది. డిసెంబర్ 5న రిలీజైన ఈ మూవీ 23 రోజుల్లో ఇండియా వైడ్ గా రూ.668 కోట్ల నెట్, ప్రపంచవ్యాప్తంగా రూ. 1000 కోట్లకి పైగా (గ్రాస్) వసూళ్లు రాబట్టింది.

ఈ సినిమాపై తొలి నుంచి పాజిటివ్ టాక్ తో రికార్డులు సృష్టిస్తూ..  ట్రేడ్ వర్గాలను విస్మయానికి గురిచేసింది. ఈ భారీ వసూళ్లతో అత్యధిక వసూళ్లు సాధించిన టాప్ 10 భారతీయ చిత్రాల జాబితాలో ‘ధురంధర్’ 9వ స్థానానికి చేరుకోవడమే కాకుండా, రణబీర్ కపూర్ నటించిన ‘యానిమల్’ రికార్డులను సైతం తుడిచిపెట్టేసింది.