
రౌడీ హీరో విజయ్ దేవరకొండ(Vijay Devarakonda), సౌత్ స్టార్ హీరోయిన్ సమంత(Samantha) జంటగా నటించిన మూవీ ఖుషీ(Khushi). క్లాసిక్ సినిమాలా దర్శకుడు శివ నిర్వాణ(Shiva nirvana) డైరెక్ట్ చేయగా.. పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ఈ మూవీ ఫస్ట్ వీకెండ్ వరకు వసూళ్లు బాగానే వచ్చిన..ఆ తర్వాత వసూళ్లు బాగా డ్రాప్ అయ్యాయి. అయితే రీసెంట్ గా వైజాగ్ లో సక్సెస్ మీట్ ను నిర్వహించారు మేకర్స్.
ఖుషి కి వచ్చిన పాజిటివ్ టాక్కు..ఖుషి ఆయిన విజయ్ దేవరకొండ తన ఫ్యాన్స్ 100 కుటుంబాలకు లక్ష రూపాయల చొప్పున చెక్ అందజేస్తున్నట్లు మాట ఇచ్చారు. ఇందుకు అప్లికేషన్స్ కొరకు రెండు వారాలు టైం ఇచ్చిన విజయ్..నిన్నటితో అప్లికేషన్ ప్రక్రియ ముగిసింది. నేడు (సెప్టెంబర్ 14) న హైదరాబాద్లో జరుగుతున్న ఈవెంట్లో చెక్కులు అందజేయనున్నారు విజయ్. తమ ఫ్యాన్స్లో ఎవరికైతే అత్యవసర ఆర్థిక సాయం అవసరముందో..వారిని సెలెక్ట్ చేసినట్లు తెలుస్తుంది. ఈ కోటి రూపాయల అమౌంట్ మొత్తాన్ని విజయ్ తన రెమ్యూనరేషన్ నుంచి అందజేస్తున్నారు.
హీరో విజయ్కు డియర్ కామ్రేడ్ మూవీ నుంచి.. పూరి లైగర్ వరకు కంటిన్యూగా ఫ్లాపులతో కెరీర్ను నడిపిస్తున్నాడు. ఇక రీసెంట్గా ఖుషి మూవీ హిట్తో మళ్ళీ జోష్ పెంచినట్లు తెలుస్తుంది. ఈ మూవీ అన్ని చోట్ల బ్రేక్ ఈవెన్ను రిచ్ అవ్వలేదు. కేవలం నైజం లో తప్ప మిగిలిన అన్ని చోట్ల నష్టాలూ వచ్చినట్లు సమాచారం. ఇక ఫ్యాన్స్కు ఇచ్చిన మాట మేరకు ఈ ఆర్థిక సాయాన్ని అందిస్తున్నారు విజయ్.
ప్రస్తుతం విజయ్ దేవరకొండ డైరెక్టర్ పరుశురామ్ తో ఓ మూవీ చేయనున్నారు. ఈ మూవీకి ఫ్యామిలీ స్టార్ అనే టైటిల్ పెట్టినట్లు సమాచారం.
The 100 familes we picked this time. I hope it brings cheer to your families ❤️?#SpreadingKushi#DevaraFamily pic.twitter.com/9Om8E2dJho
— Vijay Deverakonda (@TheDeverakonda) September 14, 2023