- రాష్ట్ర పబ్లిక్ ప్రాసిక్యూటర్ పల్లె నాగేశ్వర్ రావు
అబిడ్స్, వెలుగు: స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి హైకోర్టులో దళితుడికి రాష్ట్ర పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా అవకాశం దక్కలేదని, సీఎం రేవంత్ రెడ్డి చొరవతోనే తనకు ఆ అరుదైన అవకాశం దక్కిందని పల్లె నాగేశ్వర్ రావు తెలిపారు. అబిడ్స్‌లో ఆల్ ఇండియా కన్ఫెడరేషన్ ఆఫ్ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనార్టీ ఆర్గనైజేషన్స్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. గ్రామీణ స్థాయి నుంచి వచ్చి ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్నానని, బాబాసాహెబ్ అంబేద్కర్ స్ఫూర్తితోనే ఈ స్థాయికి చేరుకున్నానని తెలిపారు.
ఈ సందర్భంగా బార్ అసోసియేషన్ ఎన్నికల్లో గెలుపొందిన న్యాయవాదులను కన్ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు కె. మహేశ్వర్ రాజ్‌తో కలిసి ఆయన సన్మానించి, రాజ్యాంగ ప్రతిని అందజేశారు. ఆర్డీవో రామకృష్ణ, కన్ఫెడరేషన్ వైస్ ప్రెసిడెంట్ శ్రీనివాసరావు, డాక్టర్ బాలకృష్ణ పాల్గొన్నారు.
