- ఓవర్‌హెడ్ వైర్లు తెగిపోవడంతో రెండు గంటలు ఆగిపోయిన రైలు
మల్కాజ్‌గిరి, వెలుగు: సికింద్రాబాద్ నుంచి పల్నాడుకు బయలుదేరిన పల్నాడు ఎక్స్‌ప్రెస్‌కు మౌలాలి రైల్వే స్టేషన్ సమీపంలో అంతరాయం ఏర్పడింది. ఓవర్‌హెడ్ విద్యుత్ వైర్లు తెగిపోవడంతో రైలు అక్కడే నిలిచిపోయింది.
దాదాపు రెండు గంటలపాటు రైలు కదలకపోవడంతో ప్రయాణికులు అసౌకర్యానికి గురయ్యారు. రైల్వే అధికారులు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని మరమ్మతు పనులు చేపట్టారు. ప్రయాణికులకు మరో రైలులో చర్లపల్లి వరకు తరలించారు. అనంతరం చర్లపల్లి స్టేషన్ నుంచి మరో పల్నాడు ఎక్స్‌ప్రెస్‌ను సిద్ధం చేశారు.
