కౌంటింగ్ కేంద్రం నుంచి వెళ్లిపోయిన పాల్వాయి స్రవంతి

కౌంటింగ్ కేంద్రం నుంచి వెళ్లిపోయిన పాల్వాయి స్రవంతి

మునుగోడులో బైపోల్ కౌంటింగ్ హోరాహోరీగా సాగుతోంది. రౌండ్, రౌండ్ కి కౌంటింగ్ లో తేడా కనిపిస్తోంది. మొదటి నాలుగు రౌండ్లు ముగిసే సరికి టీఆర్ఎస్ 613ఓట్లతో ఆధిక్యంలో ఉండగా.. బీజేపీ సెకండ్ స్థానంలో నిలుస్తోంది. కాంగ్రెస్ వెనుకంజలో ఉన్న క్రమంలో... ఆ పార్టీ అభ్యర్థి పాల్వాయి స్రవంతి మునుగోడులోని ఓ కౌంటింగ్ కేంద్రం నుంచి వెళ్లిపోయారు. మూడో రౌండ్ కౌంటింగ్ కొనసాగుతుండగానే ఆమె బయటికి వచ్చినట్టు తెలుస్తోంది. అందరికంటే ముందుగానే ఆమె కౌంటింగ్ కేంద్రానికి చేరుకుని గెలుపుపై ధీమాను వ్యక్తం చేసినప్పటికీ... మొదటి రెండు రౌండ్లలో స్రవంతికి బీజేపీ, టీఆర్ఎస్ కంటే తక్కువ ఓట్లు వచ్చాయి.