
హైదరాబాద్, వెలుగు: అసెంబ్లీ, కౌన్సిల్ ఆమోదించిన పంచాయతీ రాజ్, మున్సిపల్ చట్ట సవరణ బిల్లులు రాజ్ భవన్ కు చేరాయి. పంచాయతీ రాజ్ చట్టం 2018లో సవరణలు చేయడంతో పాటు 50 శాతం సీలింగ్ ను ఎత్తివేస్తూ అసెంబ్లీ, కౌన్సిల్ బిల్ పాస్ చేసింది. గతంలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని ఒక బిల్ తో పాటు ఆర్డినెన్స్ ను రాష్ర్టపతికి గవర్నర్ పంపారు.
ఇప్పుడు మరో సారి అసెంబ్లీ బిల్ ను పంపింది. అన్ని పార్టీలు ఈ బిల్ కు మద్దతు తెలిపాయని, దీన్ని ఆమోదించాలని ఇటీవల పీసీసీ చీఫ్, మంత్రులు, బీఆర్ఎస్, సీపీఐ నేతలు గవర్నర్ ను కలిసి విన్నవించాయి. ఇప్పుడైనా గవర్నర్ ఆమోదిస్తారా లేదా అన్న అంశం చర్చనీయాంశంగా మారింది. ఈ నెల 30 లోపు ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు ఆదేశించింది. గవర్నర్కు చేరిన బిల్లులు