ఇకపై కేంద్రీకృత విధానంలోమల్టీ పర్పస్ వర్కర్లకు వేతనాలు

ఇకపై కేంద్రీకృత విధానంలోమల్టీ పర్పస్ వర్కర్లకు వేతనాలు
  • కొత్త మార్గదర్శకాలు జారీ చేసిన పంచాయతీరాజ్ శాఖ  

హైదరాబాద్, వెలుగు: గ్రామ పంచాయతీల్లో మల్టీ పర్పస్ వర్కర్ల (ఎంపీడబ్ల్యూ) వేతన చెల్లింపుల్లో అవకతవకల నిరోధానికి పంచాయతీరాజ్ శాఖ కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది. ఈ మార్గదర్శకాల ప్రకారం..ఎంపీడబ్ల్యూలకు ఇకపై కేంద్రీకృత విధానంలో టీజీ- బీపాస్​ ఖాతాల ద్వారా వేతనాలను చెల్లించనున్నారు.ఐఎఫ్ఎంఐఎస్ ద్వారా చెక్కులు  జనరేట్ చేయడాన్ని నిషేధించారు. కార్యదర్శులు ప్రతినెలా మల్టీపర్పస్​ వర్కర్ల సంఖ్య, వేతన వివరాలను ఈ-పంచాయతీ పోర్టల్‌‌‌‌లో నమోదు చేయాలి.

దీన్ని డీపీవోలు, డీఎల్​పీవోలు, ఎంపీవోలు తమ స్థాయిలో పర్యవేక్షించాలి.  ఇకపై మల్టీపర్పస్​వర్కర్ల వేతన బిల్లులను ట్రెజరీ స్వీకరించదు.  అన్ని చెల్లింపులు కేంద్రీకృత విధానం ద్వారానే జరగనున్నాయి. ఆర్థిక నిబంధనలు పాటించడంతో పాటు కొత్త మార్గదర్శకాలను కచ్చితంగా అమలు చేయాలని డీపీవోలను పంచాయతీరాజ్ శాఖ డైరెక్టర్ సృజన ఆదేశించారు. అనధికార పారిశుధ్య కార్మికుల నియామకాలు, వేతనేతర ఖర్చులను జీతాల కింద క్లెయిమ్ చేయడం వంటి అంశాలు శాఖ దృష్టికి రావడంతో కొత్త మార్గదర్శకాలను అమల్లోకి తెచ్చినట్లు స్పష్టం చేశారు.