
మంగళవారం ( సెప్టెంబర్ 16 ) సెక్రటేరియట్ లో అస్వస్థతకు గురైన కాంగ్రెస్ సీనియర్ నేత, టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మెన్ మధుయాష్కీ గౌడ్ ను పరామర్శించారు మంత్రులు వివేక్ వెంకటస్వామి, పొన్నం ప్రభాకర్. స్వల్ప అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందిన ఆయన బుధవారం ( సెప్టెంబర్ 17 ) ఇంటికి చేరుకున్నారు.
బంజారాహిల్స్ లోని ఆయన నివాసానికి వెళ్లి పరామర్శించారు మంత్రులు వివేక్ వెంకటస్వామి, పొన్నం ప్రభాకర్. ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్న మంత్రులు ఆయనతో కాసేపు ముచ్చటించారు. మంగళవారం సెక్రటేరియట్ లో అస్వస్థతకు గురైన మధుయాష్కీని సమీపంలోని ఏఐజీ హాస్పిటల్లో చేర్చారు సెక్రటేరియట్ సిబ్బంది. ఏఐజీ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న ఆయనను సీఎం రేవంత్ రెడ్డి పరామర్శించారు.
ఆయన ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్న సీఎం రేవంత్.. అస్వస్థతకు గల కారణాలు తెలుసుకున్నారు. మధుయాష్కీకి అందిస్తున్న చికిత్సపై ప్రత్యేక పర్యవేక్షణ ఉండేలా చూడాలని సూచించారు సీఎం రేవంత్.