ఆఫీసర్ల ఒత్తిడితో పంచాయతీ కార్యదర్శి సూసైడ్

ఆఫీసర్ల ఒత్తిడితో పంచాయతీ కార్యదర్శి సూసైడ్
  • భూపాలపల్లి జిల్లా పర్లపెల్లిలో ఘటన 

మొగుళ్లపల్లి, వెలుగు:  ఆఫీసర్ల ఒత్తిడి తట్టుకో లేక పంచాయతీ కార్య దర్శి సూసైడ్ చేసుకు న్నాడు. ఈ ఘటన భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలం పర్లపెల్లిలో జరిగింది. పర్లపెల్లికి చెందిన అబ్బు రాజేందర్‌ రెడ్డి (39) టేకుమట్లలో పంచాయతీ కార్యదర్శిగా పని చేస్తున్నాడు. 

బుధవారం డ్యూటీ ముగించుకుని తిరిగి ఇంటికి వస్తూ విషం తాగి ఆత్మహత్యకు యత్నించాడు. కుటుంబసభ్యులు ఆయనను వరంగల్‌ ఎంజీఎంకు తరలించగా, అక్కడ ట్రీట్‌మెంట్‌ తీసుకుంటూ గురువారం చనిపోయాడు. కాగా, రాజేందర్‌రెడ్డి ఆత్మహత్యకు ఆఫీసర్ల ఒత్తిళ్లు, ప్రజా సంఘాల నేతల వేధిం పులే కారణమని  కుటుంబసభ్యులు ఆరోపించారు. టేకుమట్లకు చెందిన కొందరు ప్రజా సంఘాల లీడర్లు బెదిరించేవారని తెలిపారు.