
హైదరాబాద్, వెలుగు: నిమ్స్‌లో కొత్త బిల్డింగులకు శంకుస్థాపన సందర్భంగా బుధవారం పంజాగుట్ట పరిసర ప్రాంతాల్లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఉదయం10 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ఆంక్షలు అమలులో ఉంటాయని ట్రాఫిక్ చీఫ్ సుధీర్‌బాబు మంగళవారం నోటిఫికేషన్ విడుదల చేశారు. వీవీఐపీల మూవ్‌మెంట్‌కు అనుగుణంగా ట్రాఫిక్ ఆంక్షలు విధించనున్నట్లు తెలిపారు. గ్రీన్ ల్యాండ్స్ – పంజాగుట్ట, మొనప్ప, రాజ్‌భవన్ రోడ్, వీవీ విగ్రహం, కేసీపీ జంక్షన్, నిమ్స్, పంజాగుట్ట, ఎన్‌ఎఫ్‌సీఎల్, తాజ్‌కృష్ణ రూట్లలో ట్రాఫిక్‌కు అంతరాయం కలిగే అవకాశం ఉందని తెలిపారు. వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని సూచించారు.