హైదరాబాద్​లో పారా మెడికల్ జాబ్స్​

హైదరాబాద్​లో పారా మెడికల్ జాబ్స్​

జాయింట్ డైరెక్టర్ (మెడికల్), ఇన్సూరెన్స్ మెడికల్ సర్వీసెస్​ కాంట్రాక్ట్​ ప్రాతిపదికన హైదరాబాద్ జిల్లాలోని ఈఎస్‌‌‌‌‌‌‌‌ఐ హాస్పిటళ్లు/ ఈఎస్‌‌‌‌‌‌‌‌ఐ డిస్పెన్సరీలు/ ఈఎస్‌‌‌‌‌‌‌‌ఐ డయాగ్నస్టిక్ సెంటర్‌‌‌‌‌‌‌‌లలో సర్జన్, పారా మెడికల్​ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది.

పోస్టులు: మొత్తం 114 పోస్టుల్లో సివిల్ అసిస్టెంట్ సర్జన్ 59,  డెంటల్ అసిస్టెంట్ సర్జన్ 1, ల్యాబ్ టెక్నీషియన్ 11, ఫార్మసిస్ట్ 43 ఖాళీగా ఉన్నాయి.
అర్హత: పోస్టును అనుసరించి ఎంబీబీఎస్‌‌‌‌‌‌‌‌, బీడీఎస్‌‌‌‌‌‌‌‌, ల్యాబొరేటరీ టెక్నీషియన్ సర్టిఫికేట్, డీఫార్మసీ ఉత్తీర్ణులై ఉండాలి.  వయసు18 నుంచి 44 సంవత్సరాల మధ్య ఉండాలి.

అప్లికేషన్స్​: ఆఫ్‌‌‌‌‌‌‌‌లైన్‌‌‌‌‌‌‌‌ దరఖాస్తులను పోస్టు ద్వారా లేదా వ్యక్తిగతంగా జాయింట్ డైరెక్టర్ (మెడికల్), ఇన్సూరెన్స్ మెడికల్ సర్వీసెస్, హైదరాబాద్, అయిదో అంతస్తు, హాస్టల్ బిల్డింగ్, ఈఎస్ఐ హాస్పిటల్ సనత్‌‌‌‌‌‌‌‌నగర్, నాచారం, హైదరాబాద్‌‌‌‌‌‌‌‌ అడ్రస్ కు మార్చి 28 వరకు పంపించాలి. వివరాలకు www.hyderabad.telangana.gov.in వెబ్​సైట్​ సంప్రదించాలి.