మోనాకు పారాలింపిక్స్‌‌‌‌‌‌‌‌ బెర్త్‌‌‌‌‌‌‌‌

మోనాకు పారాలింపిక్స్‌‌‌‌‌‌‌‌ బెర్త్‌‌‌‌‌‌‌‌

న్యూఢిల్లీ: ఇండియా పారా షూటర్‌‌‌‌‌‌‌‌ మోనా అగర్వాల్‌‌‌‌‌‌‌‌.. దేశం తరఫున తొలి పారాలింపిక్స్‌‌‌‌‌‌‌‌–2028 బెర్త్‌‌‌‌‌‌‌‌ను ఖాయం చేసుకుంది. సౌత్‌‌‌‌‌‌‌‌ కొరియాలోని చాంగ్‌‌‌‌‌‌‌‌వోన్‌‌‌‌‌‌‌‌ వేదికగా జరిగిన డబ్ల్యూఎస్‌‌‌‌‌‌‌‌పీఎస్‌‌‌‌‌‌‌‌ వరల్డ్‌‌‌‌‌‌‌‌ చాంపియన్‌‌‌‌‌‌‌‌షిప్‌‌‌‌‌‌‌‌లో మోనా 10 మీటర్ల ఎయిర్‌‌‌‌‌‌‌‌ రైఫిల్‌‌‌‌‌‌‌‌ స్టాండింగ్‌‌‌‌‌‌‌‌ ఎస్‌‌‌‌‌‌‌‌హెచ్‌‌‌‌‌‌‌‌–1 విభాగంలో సిల్వర్‌‌‌‌‌‌‌‌ మెడల్‌‌‌‌‌‌‌‌ను సాధించింది.

పారిస్‌‌‌‌‌‌‌‌ పారాలింపిక్స్‌‌‌‌‌‌‌‌లో గోల్డ్‌‌‌‌‌‌‌‌ నెగ్గిన అవని లేఖర కాంస్యం దక్కించుకుంది. అయితే తొలి రెండు స్థానాల్లో నిలిచిన వారికి మాత్రమే పారాలింపిక్స్‌‌‌‌‌‌‌‌ కోటా ఉండటంతో అవనికి అవకాశం దక్కలేదు. టీమ్‌‌‌‌‌‌‌‌ ఈవెంట్‌‌‌‌‌‌‌‌లో మోనా అగర్వాల్‌‌‌‌‌‌‌‌–అవని లేఖర జోడీ గోల్డ్‌‌‌‌‌‌‌‌ మెడల్‌‌‌‌‌‌‌‌ నెగ్గింది. కాళ్ల వైకల్యం ఉండి స్టాండ్‌‌‌‌‌‌‌‌ సాయం లేకుండా తుపాకీ బరువును మోయగలిగే షూటర్లు ఎస్‌‌‌‌‌‌‌‌హెచ్‌‌‌‌‌‌‌‌–1 కేటగిరీలో పోటీపడతారు.