చెరువుల సంరక్షణ కోసం మహిళ డ్యాన్స్ సిరీస్

చెరువుల సంరక్షణ కోసం మహిళ డ్యాన్స్ సిరీస్

హైదరాబాద్: ప్రకృతిని కాపాడుకుందాం లేకుంటే భవిష్యత్ దుర్భరమే అని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. మానవ మనుగడకు ముఖ్యమైన నీరు, నీటి వనరులను కాపాడకోవాల్సిన బాధ్యత అందరి పైనా ఉంది. కానీ ఈ గజిబిజి లైఫ్‌‌లో ప్రజలకు అర్థమయ్యేలా ఈ విషయాలను చెప్పేంత టైమ్, ఓపిక ఎవరికి ఉందో చెప్పండి? కానీ ఇక్కడో మహిళ మాత్రం లేక్స్‌‌ను కాపాడుకుందాం అంటూ  గొంతెత్తుతోంది. హైదరాబాద్ నగరంలోని చెరువులను ప్రొటెక్ట్ చేయడానికి డ్యాన్స్ సిరీస్‌‌ చేసి అందరి మనసుల్ని చూరగొంటోంది. ఆమె పేరు మధులికా చౌదరి.

సిటీలోని చెరువుల సంరక్షణ కోసం 2016 నుంచి మధులిక పోరాడుతోంది. చెరువుల సంరక్షణ ప్రాముఖ్యతను తెలియజేస్తూ ‘బ్యాక్ టూ రూట్స్ క్యాంపెయిన్-పారంపరా’ పేరుతో డ్యాన్స్ సిరీస్‌‌ను రూపొందించింది. పారంపర అనేది వాతావరణాన్ని కాపాడుకోవాలని మనకు సూచించే ప్రాచీన కళ అని మధులిక చెబుతోంది. చాలా మంది అనవసర చెత్తను నింపుతూ చెరువులను నాశనం చేస్తున్నారని, లేక్స్‌‌ను కాపాడుకోవడం మన బాధ్యత అని అందరూ గుర్తించాలని ఆమె విజ్ఞప్తి చేసింది.