గుండాల మండల కేంద్రంలోని స్టూడెంట్స్ తో వెట్టిచాకిరీ

  గుండాల మండల కేంద్రంలోని స్టూడెంట్స్ తో వెట్టిచాకిరీ

గుండాల, వెలుగు: గుండాల మండల కేంద్రంలోని కేజీబీవీలో ఆదివారం కావడంతో టీచర్స్ ఇంటిదారి పట్టారు. మరో మార్గం లేక స్టూడెంట్స్ పాల కోసం రోడ్డుపైకి వచ్చి తీసుకెళ్తుండగా ‘వెలుగు’ క్లిక్​​మనిపించింది. కాగా, ఇదేం పద్ధతి అని టీచర్స్ తీరుపై పేరెంట్స్ మండిపడ్డారు. 

సెలవు వస్తే టీచర్స్ లేకపోయినా కనీసం వర్కర్స్ ఎటు వెళ్లారని ప్రశ్నించారు. ఇదే కాకుండా స్టూడెంట్స్​తోనే గదులు ఊడిపించడం, బయటికి నీళ్ల కోసం పంపించడం చేస్తున్నారని ఆరోపించారు. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగిస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు.