పిల్లలకు ఏ అలవాటైనా తల్లిదండ్రులు నేర్పించాల్సిందే. అన్నం తినే దగ్గరి నుంచి... నలుగురితో ఎలా మెలగాలో వరకు... అన్నీ చిన్నప్పట్నుంచే అలవాటు చేయాలి. అందులో ముఖ్యమైనది టేబుల్ మ్యానర్స్', ఇంట్లో డైనింగ్ టేబుల్ మీద తింటున్నా... బంధువుల ఇంటికి భోజనానికి వెళ్లినా... బయట రెస్టారెంట్లకు వెళ్లినా... ఎలా ఉండాలి? ఎలా తినాలి? చెప్పడమే టేబుల్ మ్యానర్స్.
డైనింగ్ టేబుల్ దగ్గరికి వస్తే చాలు...రజని వాళ్ల పిల్లలు తెగ అల్లరి చేస్తాడు. అది కావాలి... ఇది కావాలి.. అని కిందామీగా పోస్తరు. ప్లేట్లు లాగుతరు స్పూన్లు పడేస్తరు వాళ్లు డిన్నర్ కి వస్తున్నారంటే నాకు చిరాకుగా అనిపిస్తది" అని పక్కింటి జ్యోతితో చెప్పింది శ్రావణి.
ఇంట్లోనే తిందాం. ఈ పిల్లలతో రెస్టారెంట్ కి వెళ్తే అంతే సంగతులు పోయిన ఆదివారం పోతేనే చూశారుగా...ఎంత గోల చేశారో. వీళ్ల అల్లరికి అందరి ముందు తల కొట్టేసినట్లు అయింది "అన్నది భర్త కిషోర్ తో విజయ ఇలాంటి సంబాషణలు సాధారణంగా చిన్నపిల్లలు ఉన్న అందరి ఇళ్లల్లో వినిపిస్తుంటాయి. ఒకప్పటిలా కుటుంబమంతా కలిసి కూర్చుని భోజనం చేసే రోజులు పోవడం వల్ల కూడా.. పిల్లలకు తినేటప్పుడు ఎలా వ్యవహరించాలో తెలియట్లేదు. అందుకే వాళ్లకు అలాంటివి నేర్పించే బాధ్యత తల్లిదండ్రులది.
న్యాప్ కిన్ వాడాలి : తిన్న తర్వాత మూతి తుడుచుకోవడానికి మాత్రమే ఈ న్యాప్ కిన్ ఉపయోగపడుతుంది. అనుకుంటారు కానీ తినేటప్పుడు పెదాలకు నోటి చివర్లకు మెతుకులు లాంటివి. అంటినా దాంతో తుడుచుకోవచ్చు. అలాగే మధ్యలో తుమ్మినా, దగ్గినా ఈ న్యాప్ కిన్ , అడ్డుపెట్టుకోవడానికి ఉపయోగపడుతుంది. అంతేకాదు. తినేటప్పుడు న్యాప్ కిన్ ని ఎప్పుడూ ఎడమచేతిలో పట్టుకోమని పిల్లలకు చెప్పాలి లేదా అన్నం మెతుకులు మీద పడకుండా ఒళ్లో పరుచుకోమని చెప్పాలి .
నోరు తెరిచి నమలకూడదు: తింటున్న ఆహారం నములుతున్నప్పుడు.. నోరు తెరవకూడదని పిల్లలకు చెప్పాలి. అలాగే నోటి నిండా అన్నం ఉన్నప్పుడు మాట్లాడొద్దని, అలా మాట్లాడితే ఎదుటివాళ్లపై మెతుకులు పడే అవకాశం ఉందని హెచ్చరించాలి. అంతేకాదు ఇంట్లో లేదా రెస్టారెంట్లలో తినేటప్పుడు టేబుకి మీద మోచేతులు పెట్టనీయకూడదు.
పర్మిషన్ అడిగే వెళ్లాలి: ఒకరింటికి భోజనానికి వెళ్తే...తింటున్నప్పుడు మధ్యలో బయటికి వెళ్లాల్సి వస్తుంది. అప్పుడు అక్కడ ఉన్నవాళ్లకు చెప్పి వెళ్లాలి. లేదంటే 'అయ్యో, ఏమైంది? ఎటు వెళ్లారు? అది కంగారు పడతారు. అలాగే బయటికి వెళ్లినప్పుడు చేతిలోని న్యాప్ కిన్ ని కుర్చీ మీద వేసి వెళ్లాలి. ఇష్టం వచ్చిన దగ్గర పడేయకూడదు..
హోటళ్లలో ఎలా ఉండాలి: బయట తినడానికి వెళ్లినప్పుడు... ఎలా ఉండాలో పిల్లలకు ఇంట్లోనే చెప్పాలి.. రెస్టారెంట్లలో వెయిటర్ తో మర్యాదగా మాట్లాడేలా చూడాలి. అందరి ముందు పద్ధతిగా తినడం నేర్పించాలి. ఒక్కోసారి తినేటప్పుడు మధ్యలో బయటికి వెళ్లాల్సి వస్తుంది. అలా వెళ్లి తర్వాత వచ్చి చూసేసరికి టేబుల్ ఖాళీగా ఉంటుంది.
ఎందుకంటే భోజనం పూర్తి అయ్యిందేమోనని వెయిటర్లు టేబుల్ శుభ్రం చేస్తారు. అందుకే బయటికి వెళ్ళేటప్పుడు ఫోర్క్ నైఫ్ ని .. తిరగేసిన 'వి' ఆకారంలో పెట్టి వెళ్లాలి అదే భోజనం పూర్తయింది అని తెలియాలంటే... రెండింటినీ ప్లేట్ లో పక్కపక్కన పెట్టాలి. వాటిని బట్టి వెయిటర్లకు అర్ధమవుతుంది బయటికి వెళ్ళారా? లేక ఇంటికి వెళ్లారా? అని. ఈ విషయాన్ని పిల్లలకు తెలియజేయాలి.
