జ్యోతిష్య ప్రకారం జ్యేష్ఠ మాసంలో కొన్ని పనులు చేస్తే ఆంజనేయస్వామి అనుగ్రహం లభిస్తుందని పురాణాల ద్వారా తెలుస్తుంది. ముఖ్యంగా గ్రహాల దోషాలతో బాధ పడే వారిని ఆంజనేయ స్వామిని మంగళవారం ( మే 26) పూజించాలని పండితులు చెబతున్నారు. ఏ ఇబ్బందులు ఉన్నా వారు ఎలా స్వామి వారిని ఎలా పూజ చేయాలో ఈ స్టోరీలో తెలుసుకుందాం.. . .!
ఆధ్యాత్మిక గ్రంధాల ప్రకారం మంగళవారం హనుమంతుని ప్రత్యేక సంబంధం ఉంది. పురాణాల ప్రకారం స్వామివారిని మంగళ మూర్తి అని కూడా పిలుస్తూ ఉంటారు. దీనికి అర్థం సంతోషాన్ని ఇచ్చేవాడు అని. జ్యేష్ఠ మాసం..మంగళవారం నాడు ( మే 26) ఆంజనేయ స్వామి వారిని పూజిస్తే ఇంటి సమస్యలు, అప్పులు, కష్టాలు తగ్గి శుభఫలితాలు కలుగుతాయని పెద్దలు చెబుతున్నారు.
- సంపెంగ స్నానం చేస్తే – అప్పులు తగ్గుతాయి
- తమలపాకులతో స్వామివారిని పూజిస్తే – నరదృష్టి తొలగుతుంది
- బెల్లం, ఎర్ర బట్ట సమర్పిస్తే – ఉద్యోగంలో పురోగతి
- ఎర్ర గులాబీలు సమర్పిస్తే – ఇబ్బందులు దూరమవుతాయి
- అరటిపండ్లు సమర్పిస్తే – కుటుంబ సంతోషం పెరుగుతుంది
- కొబ్బరికాయతో వ్రతం చేస్తే – ఆరోగ్యం కలుగుతుంది
- ఆవు నెయ్యితో దీపం వెలిగించి ప్రార్థిస్తే – కోరికలు నెరవేరుతాయి
- బూంది లడ్డూ సమర్పిస్తే – అన్నీ పనుల్లో విజయం లభిస్తుంది
మంగళవారం నాడు ఆంజనేయ స్వామి వారిని సింధూరంతో అర్చించి, తమలపాకులతో ఆకు పూజ చేసి, వడమాల లేదా అప్పాల మాల సమర్పించిన యెడల తప్పక కోరికలు నెరవేరుతాయి. నిజమైన భక్తితో స్వామివారిని అర్చించే భక్తులకు ఎటువంటి గ్రహ దోషాలు ఉండవు. హనుమంతుని పూజించే వారికి నరఘోష ... బంధు ఘోష గ్రహ బాధలు తొలగి ...భూత ప్రేతాది శక్తులు దరిచేరకుండా రక్షణ కలుగుతుందని పండితులు చెబుతున్నారు.
