మెడికల్ మిరాకిల్.. చైనా నుంచి హైదరాబాద్ పేషెంట్‌కు రిమోట్ రోబోటిక్ సర్జరీ

మెడికల్ మిరాకిల్.. చైనా నుంచి హైదరాబాద్ పేషెంట్‌కు రిమోట్ రోబోటిక్ సర్జరీ

వైద్యరంగంలో మరో అద్భుతం..వేల కిలోమీటర్ల దూరం ఇక చికిత్సకు అడ్డుకాదని నిరూపిస్తూ చైనాలో ఉన్న వైద్యులు హైదరాబాద్‌లోని ఓ పేషెంట్‌కు విజయవంతంగా రిమోట్ సర్జరీ నిర్వహించారు. దాదాపు 3 వేల కిలోమీటర్ల దూరంలో ఉండి అత్యాధునిక టెక్నాలజీ సాయంతో ఈ ఆపరేషన్ పూర్తి చేయడం వైద్యరంగంలో కొత్త అధ్యాయం. దీనికి సంబంధించిన నెట్టింట వీడియో వైరల్ అవుతోంది. ఈ సర్జరీ సక్సెస్ తో భవిష్యత్‌లో దూర ప్రాంతాల రోగులకు కూడా నాణ్యమైన వైద్య సేవలు మరింత అందుబాటులోకి వచ్చే అవకాశాలపై ఆశలు పెరిగాయి.

చైనాలోని వుహాన్‌లో పనిచేస్తున్న భారతీయ యూరాలజిస్ట్ డాక్టర్ సయ్యద్ మహమ్మద్ గౌస్..3వేల  కిలోమీటర్ల దూరంలో భారతదేశంలోని హైదరాబాద్‌లో ఉన్న  సర్జరీ చేసి రోగి ప్రాణాలను కాపాడారు. రోగికి రోబోట్ సహాయంతో మూత్రనాళాన్ని తిరిగి అమర్చే సంక్లిష్టమైన శస్త్రచికిత్స అవసరమైంది. సాధారణంగా, దీనికి వైద్యుడు అదే ఆస్పత్రిలో ఉండవలసి ఉంటుంది. కానీ చైనాలో అభివృద్ధి చెందిన రోబోటిక్ వ్యవస్థలు ,అత్యంత వేగవంతమైన 5G సాంకేతికత పుణ్యమా అని డాక్టర్ ఘౌస్.. వుహాన్ నుండే శస్త్రచికిత్స రోబోట్‌ను నియంత్రించగలిగారు. మొత్తం ఆపరేషన్ కేవలం 90 నిమిషాల్లోనే పూర్తయింది.

ఇది  వైద్యరంగంలో అతి పెద్ద ముందడుగు. మారుమూల ప్రాంతాల్లోని ప్రజలకు రోబోటిక్స్, 5జీ ఎలా అధునాతన చికిత్సను అందించగలవో ఇది తెలియజేస్తుంది. అలాగే ప్రాణాలను కాపాడటంలో భారత్, చైనా ఎలా కలిసి పనిచేయగలవో కూడా ఇది చూపిస్తుంది.డాక్టర్ ఘౌస్ సాధించిన విజయం కేవలం ఒక శస్త్రచికిత్సకు సంబంధించినది కాదు..ఇది భవిష్యత్తుకు ఒక సూచన. ఫ్యూచర్ లో డాక్టర్లు టెక్నాలజీ సహాయంతో సరిహద్దులు దాటి పేషెంట్లకు చికిత్స చేసి ప్రాణాలు కాపాడగలరన్న నమ్మకాన్ని పెంచింది. 

ఇక ఈ వీడియో చూసిన తర్వాత నెటిజన్లు డాక్టర్ ను అభినందిస్తూ కామెంట్స్ చేశారు. అంతేకాదు టెక్నాలజీ సక్సెస్ ఫ్యూచర్ ను ఎంత ప్రభావితం చేస్తుందో చర్చించారు. 

ఓ నెటిజన్ స్పందించి రోబోటిక్ చైనా  టెక్నాలజీని అభినందిస్తూనే.. రిమోట్ రోబోటిక్ సర్జరీ చేసిన చైనాలో పనిచేస్తున్న భారతీయ డాక్టర్ సయ్యద్ మహ్మద్ ను అత్యంత స్కిల్డ్ డాక్టర్  అంటూ అభినందించారు. 

మరో నెటిజన్ స్పందిస్తూ.. టెక్నాలజీ, మానవ మేథస్సు కలిసి సాధించిన అద్భుతమైన సక్సెస్ అని అన్నారు. ఆపరేషన్ చేసిన డాక్టర్లకు ధన్యవాదాలు తెలిపారు నెటిజన్లు.