
టీనేజ్ పిల్లలతో పేరెంట్స్ ఎలా ఉండాలి.. .. .. టీనేజ్ పిల్లలు తప్పటడుగులు వేయకుండా జీవితంపై ఫోకస్ పెట్టాలంటే.... తల్లిదండ్రులు ఎలాంటి సలహాలు, సూచనలు ఇవ్వాలి? టీనేజ్ పిల్లల విషయంలో పేరెంట్స్ ఎలా వ్యవహరించాలి! మొదలగు విషయాలను ఈ స్టోరీలో తెలుసుకుందాం. .
పసి పిల్లలను పెంచడం ఒక ఎత్తు... టీనేజ్ పిల్లల వ్యవహారం ఇంకో ఎత్తు. ఎందుకంటే ఆ వయసులో పిల్లల హార్మోన్లలో తేడాలు వస్తాయి. అందుకని టీనేజ్ పిల్లలకు ఎప్పటికప్పుడు సరైన సలహాలు ఇస్తూ అమ్మానాన్నలు ఒక మంచి గైడ్ లా ప్రవర్తించాలి. ప్రతి విషయంలోనూ వాళ్లకు అటెన్షన్ ఇవ్వడం చాలా అవసరం. దానివల్ల యాటిట్యూడ్, మూడ్ స్వింగ్స్ వేరుగా ఉంటాయి. ఈ హార్మోన్ల మార్పులు 3 నుంచి 18 ఏళ్లలోపు పిల్లల్లో ఎక్కువగా ఉంటాయి. ఆ సమయంలో వచ్చే శారీరక, మానసిక మార్పులు... తల్లిదండ్రులకు ఒక చాలెంజ్ గా మారతాయి.
ఎక్కువ కంట్రోల్ చేయొద్దు: టీనేజ్ కు వచ్చిన పిల్లలను అమ్మానాన్నలు ఎక్కువగా కంట్రోల్ చేయకూడదు. అన్నింట్లో కాకపోయినా.. కొన్ని విషయాల్లో వాళ్లకు నిర్ణయం తీసుకునే ఫ్రీడం ఇవ్వాలి. మరీ ఎక్కువగా కంట్రోల్ చేయడం వల్ల మొండిగా తయారవుతారు. పెద్దలపై ఉన్న భయం... గౌరవం పోయి తప్పుడు నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి విషయంలోనూ వాళ్లను కంట్రోల్ చేస్తే..కచ్చితంగా వాళ్లు తప్పుదోవే ఎంచుకుంటారు..
ఓపెన్ గా ఉండాలి: చాలా విషయాల్లో పిల్లలతో అమ్మానాన్నలు ఓపెన్ గా ఉండాలి. అప్పుడే వాళ్లు పెద్దల మాటలు, సలహాలను గౌరవిస్తారు. అందులోని మంచి ఏంటో తెలుసుకుంటారు. ఉదాహరణకు స్మోకింగ్, డ్రగ్స్, ఆల్కహాల్ వంటి వాటివల్ల కలిగే హాని గురించి వివరించాలి. చాలామంది పిల్లలకు ఇవన్నీ అలవాటయ్యేది టీనేజ్ లోనే ఈ విషయంలో పిల్లలకు పెద్దల గైడెన్స్ తప్పకుండా ఉండాలి.
కొత్త స్నేహాలు మంచివే: కొంతమంది అమ్మానాన్నలు తమ పిల్లల్ని.. ఫ్రెండ్స్ విషయంలో చాలా కట్టడి చేస్తారు.కొత్తవాళ్లెవ్వరితోనూ స్నేహం చేయొద్దంటారు. ఉన్న స్నేహితులను దూరం చేసుకోమని చెప్తారు. అలా చేయడం పిల్లల మానసిక ఎదుగుదలకు అస్సలు మంచిది కాదు.. కొందరు పిల్లలు అమ్మానాన్నల కంటే స్నేహితులతోనే ఎక్కువ విషయాలను షేర్ చేసుకోవడానికి ఇష్టపడతారు. అలాంటి వాళ్లకు స్నేహితులు లేకపోతే... మానసిక సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయి. అందుకే కొత్త స్నేహాలు మంచిది కాదని అనుకోవద్దు ఎవ్వరికైనా కొత్తవాళ్లతో పరిచయాలు అవసరం. ఒకవేళ ఆ విషయంలో పెద్దలకు భయంగా ఉంటే.. తమ ఫ్రెండ్స్ ని ఇంటికి తీసుకురమ్మని చెప్పాలి. అప్పుడు అవతలి వాళ్లు ఎలాంటి వాళ్లో తెలుసుకోవచ్చు.
పరిశీలించడం : పిల్లలు చేసే ప్రతి పనిలో తల దూర్చడం... -చిన్న విషయాన్ని కూడా మానిటర్ చేయడం తప్పు ఏదైనా తెలుసుకోవాలంటే.. వాళ్లనే డైరక్ట్‌గా అడగాలి. అంతేకానీ రహస్యంగా వెంబడించడం, దొంగచాటుగా పిల్లలు వస్తువులను తనిఖీ చేయడం కరెక్ట్ కాదు. అలా చేసినట్లు పిల్లలకు తెలిస్తే.. తర్వాత మంచి ఏ పని చేసినా అమ్మానాన్నలకు తెలియకుండా ఉండాలని జాగ్రత్త పడతారు. ఇప్పుడు వాళ్లు వేసే తప్పటడుగు తెలియకుండా పోతుంది. అందుకే ఎలాంటి విషయాన్నైనా వాళ్లను అడగడానికి, డిస్కస్ చేయడానికి సంకోచించొద్దు..
అందం విషయంలో: టీనేజ్ లో ఉన్నప్పుడు.. అమ్మాయిలకైనా అబ్బాయిలకైనా అందంపై అటెన్షన్ ఎక్కువగా ఉంటుంది. హార్మోన్ల అసమతుల్యత వల్ల మొటిమలు, మచ్చలు వంటివి ముఖంపై కనిపిస్తే.. చాలామంది డిప్రెస్ అవుతారు. తాము అసలు అందంగా లేమని, ఆకర్షణీయంగా కనిపించలేదని బాధపడతారు. అలాంటి సంకేతాలు గమనించినట్టైతే వాళ్లకు తగిన సలహాలు.. సూచనలు ఇవ్వాలి. అందం, ఆరోగ్యం వంటి విషయాలను గురించి వివరంగా చెప్పాలి.
ఒత్తిడి వద్దు: చదువు లేదా ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ లో పిల్లలపై ఎక్కువగా ఒత్తిడి పెట్టొద్దు. పదేపదే వాటి గురించి మాట్లాడుతూ.. లోపాలు గుర్తు చేస్తూ ఉంటే వాళ్లకు పేరెంట్ పై కోపం పెరుగుతుంది. అంతేకాదు మెల్లిగా ఆత్మవిశ్వాసాన్ని కోల్పోవచ్చు.కాబట్టి వాళ్లకు వచ్చిన పనినే చేయనివ్వాలి. ఏది ఇష్టంగా చేయగలరో దానినే ప్రోత్సహించాలి. అప్పుడే వాళ్లు సక్సెస్ అవ్వగలరు.
ఫ్యామిలీ ట్రిప్స్: టీనేజీలో ఉండే మూడ్ స్వింగ్స్ ని పిల్లలకు దూరం చేయడంలో ఫ్యామిలీ ట్రిప్స్ బాగా ఉపయోగపడతాయి. బయటికి తీసుకెళ్లి సినిమాలు చూపించడం, ఇంట్లో ఉన్నప్పుడు కలిసి టీవీ చూడటం, అప్పుడప్పుడు పిక్ నిక్ కు తీసుకెళ్లడం, బయట డిన్నర్ కి ప్లాన్ చేయడం వంటివి పిల్లల్లో మానసిక ఉల్లాసాన్ని పెంచుతాయి. అలాగే ఫ్యామిలితో ఉన్న బంధం బలపడుతుంది..