సోషల్‌ మీడియాలో వైరల్‌గా పరిణీతి చోప్రా, రాఘవ్‌ చద్దాల మ్యారేజ్ రిసెప్షన్ ఆహ్వాన పత్రిక

సోషల్‌ మీడియాలో వైరల్‌గా పరిణీతి చోప్రా, రాఘవ్‌ చద్దాల మ్యారేజ్ రిసెప్షన్ ఆహ్వాన పత్రిక

న్యూఢిల్లీ : సినీనటి పరిణీతి చోప్రా, ఆమ్‌ ఆద్మీ పార్టీ నేత రాఘవ్‌ చద్దా తమ వివాహ రిసెప్షన్‌కు ఆహ్వానం పలుకుతూ పోస్టు చేసిన ఇన్విటేషన్‌ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఇద్దరు సెలెబ్రిటీలు సెప్టెంబర్ 23వ తేదీన వివాహ బంధం ద్వారా ఒక్కటి కానున్నారు. దాంతో 23 నుంచే మెహందీ, హల్దీ, సంగీత్‌ కార్యక్రమాలు ప్రారంభం కానున్నాయి. ఆ తర్వాత సెప్టెంబర్‌ 30న చండీగఢ్‌లోని తాజ్ హోటల్‌లో స్నేహితులు, కుటుంబసభ్యులకు విందు ఇవ్వనున్నారు.

ఈ క్రమంలో విందుకు సంబంధించిన ఇన్విటేషన్‌ను సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఆ ఇన్విటేషన్ కార్డు ఫొటో ఇప్పుడు సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌గా మారింది. వైట్ కలర్ లో ఉన్న ఇన్విటేషన్‌ కార్డు చుట్టూ గోల్డ్ కలర్ డిజైన్‌ ఉంది. మధ్యలో నీలం రంగులో అక్షరాలు ఉన్నాయి. ప్రముఖ బాలీవుడ్ ఫోటోగ్రాఫర్ లెన్స్‌మ్యాన్ ప్రదీప్ షేర్ చేసిన ఆహ్వాన పత్రిక వైరల్ గా మారింది. 

 

 

ఈ రిసెప్షన్‌కు పరిణీతి చోప్రా సోదరి ప్రియాంకా చోప్రా, ఆమె భర్త నిక్‌ జోనస్‌ కూడా హాజరుకానున్నారు.సెప్టెంబర్ 23, 24వ తేదీల్లో రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌ సిటీలోని హోటల్ లీలా ప్యాలెస్‌ అండ్‌ ఉదయవిలాస్‌లో పెళ్లి కార్యక్రమాలు జరగనున్నాయి. ఆ తర్వాత రోజే గురుగ్రామ్‌లో స్నేహితులు, కుటుంబసభ్యులు, బంధువులకు విందు ఇచ్చేందుకు ఏర్పాట్లు చేశారు. ఆ తర్వాత సెప్టెంబర్‌ 30న స్నేహితుల కోసం లంచ్ రిసెప్షన్‌ ప్లాన్‌ చేశారు.