కూటమి నిర్ణయానికి కట్టుబడి ఉంటా: ఫరూక్ అబ్దుల్లా

కూటమి నిర్ణయానికి కట్టుబడి ఉంటా: ఫరూక్ అబ్దుల్లా

జమ్మూ: వచ్చే లోక్‌‌సభ ఎన్నికల్లో జమ్మూ కాశ్మీర్‌‌లో సీట్ల పంపకంపై ఇండియా కూటమి నిర్ణయానికి తమ పార్టీ కట్టుబడి ఉంటుందని నేషనల్ కాన్ఫరెన్స్ (ఎన్సీ) చీఫ్ ఫరూక్ అబ్దుల్లా తెలిపారు. ఆదివారం ఓ బుక్​రిలీజ్​ఫంక్షన్​లో పాల్గొన్న అబ్దుల్లాను.. కేంద్ర పాలిత ప్రాంతంలోని పార్టీల మధ్య సీట్ల పంపకాలపై మీడియా ప్రశ్నించగా.. తాము ఇండియా కూటమిలో భాగమేనని, దాని నిర్ణయానికి కట్టుబడి ఉంటా మన్నారు.  

కాగా, కేంద్ర పాలిత ప్రాంతంలో శాంతి నెలకొందని చెప్తున్న ప్రభుత్వం.. స్థానిక సంస్థల ఎన్నికలను ఎందుకు నిర్వహించడం లేదని అబ్దుల్లా ప్రశ్నించారు. ఎన్నికలకు సిద్ధంగా ఉండాలన్నదే జమ్మూ కాశ్మీర్ ప్రజలకు తన సందేశమని ఆయన పేర్కొన్నారు. “జమ్మూ కాశ్మీర్​లో సాధారణ స్థితి నెలకొందని చెప్తున్న కేంద్రం.. ఎన్నికలు మాత్రం నిర్వహించలేకపోయిందన్నారు. ప్రజలకు మేలు చేసే పరిశ్రమల స్థాపన, ఉద్యోగ కల్పన, పర్యావరణానికి అనుకూలమైన పరిశ్రమలకు తమ పార్టీ మద్దతిస్తుందని అబ్దుల్లా చెప్పారు.