
75 ఏళ్లలో పాత పార్లమెంట్ భవనంలో 7500 మంది ఎంపీలు, 17 మంది స్పీకర్లు పనిచేశారని ప్రధాని మోదీ చెప్పారు. ఎంపీలే కాదు..ఈ భవనంలో పనిచేసిన సిబ్బంది పాత్రను గుర్తు చేసుకోవాలన్నారు. అలాగే పార్లమెంట్లో జరిగిన చర్చలను ప్రజలకు చేరవేసిన పాత్రికేయులను గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. నెహ్రూ, అంబేద్కర్ నడిచిన భవనం ఇది అన్నారు. ఇంద్రజిత్ గుప్తా ఈ భవనంలో 43 ఏళ్లు సేవలు అందించారని చెప్పారు. నెహ్రూ నుంచి మన్మోహన్ వరకు అందరూ ప్రజాస్వామ్య పరిరక్షణలో కీలక పాత్ర పోషించారని గుర్తు చేశారు.
ALSO READ: ఎవ్వరూ తగ్గేదేలే.. : నడిరోడ్డుపై చెంపలు పగలకొట్టుకున్నారు..
ఈ పార్లమెంట్ భవనం ఎన్ని చారిత్రాత్మక నిర్ణయాలకు నిలయం అన్నారు ప్రధాని మోదీ. ఆర్టికల్ 370 రద్దు నిర్ణయం ఈ భవనంలో జరిగిందన్నారు. వన్ నేషన్ వన్ పెన్షన్, జీఎస్టీ,వన్ నేషన్ వన్ రేషన్ వంటి ఎన్నో నిర్ణయాలు ఇదే భవనంలో జరిగాయి. పార్లమెంట్ లోనే జార్ఖండ్, ఉత్తరాఖండ్, తెలంగాణ వంటి రాష్ట్రాల ఏర్పాటు జరిగిందని గుర్తు చేశారు.
Also Read :- పాత పార్లమెంట్ ప్రజాస్వామ్యానికి సూచిక.. ఈ భవనంతో ఎన్నో తీపి..చేదు జ్ఞాపకాలు
ఈ భవనంలోకి తొలిసారి వచ్చినప్పుడు గడపకు శిరస్సు వచ్చి నమస్కరించానని మోదీ గుర్తు చేసుకున్నారు. .రైల్వే ప్లాట్ ఫాం మీది యువకుడు పార్లమెంట్ లో అత్యున్నత స్థానానికి చేరుకుంటాడని తానెప్పుడు ఊహించలేదన్నారు. తాను ప్రజల నుండి ఇంత ప్రేమను పొందుతానని ఎప్పుడూ అనుకోలేదన్నారు.
పార్లమెంట్పై ఉగ్రదాడిని తిప్పికొట్టిన జవాన్లకు సెల్యూట్ చేస్తున్నానని తెలిపారు. 75 ఏండ్లలో ఈ పార్లమెంట్ లో ఎన్నో చర్చలు, వాదోపవాదాలు జరిగాయని..ఎన్ని జరిగినా..అవన్నీ..మన గౌరవాన్ని పెంచాయన్నారు.