ఎవ్వరూ తగ్గేదేలే.. : నడిరోడ్డుపై చెంపలు పగలకొట్టుకున్నారు..

ఎవ్వరూ తగ్గేదేలే.. : నడిరోడ్డుపై చెంపలు పగలకొట్టుకున్నారు..

సోషల్ మీడియాలో రోజు రోజుకు ప్రాంక్ వీడియోలు ఎక్కువవుతూ ఉన్నాయి. ఇటీవలి కాలంలో చాలా మంది వ్లాగర్లు, యూట్యూబర్‌లు తమ ప్రేక్షకులను అలరించడానికి చిలిపి వీడియోలు చేస్తున్నారు. అదే తరహాలో ఇప్పుడు, ఢిల్లీ నుంచి ఒక వీడియో వచ్చింది. ఈ చిలిపి పని వల్ల గొడవ జరిగిందనడానికి ఇది సరైన ఉదాహరణ. ఈ చిలిపి చేష్టల వల్ల ఓ స్త్రీ, పురుషుడి మధ్య గొడవ జరిగి ఇద్దరూ ఒకరినొకరు కొట్టుకున్నారు. మహిళ తన కూల్ డ్రింక్ ను చిందించడంతో వీడియో మొదలైంది. కొద్దిసేపటికే ఆ అబ్బాయిని చెంపదెబ్బ కొట్టింది.

ALSO READ: భావోద్వేగంతో మోదీని హత్తుకున్న విశ్వకర్మ యోజన లబ్దిదారుడు

“అమ్మాయిని కొడతావా?” అని ఆ స్త్రీ అబ్బాయిని అడగడం వీడియోలో కనిపించింది. ఆపై ఆమె అతన్ని మళ్ళీ చెంపదెబ్బ కొట్టింది. ఈ సారి ఆ అబ్బాయి కూడా ఆమె వీపుపై కొట్టాడు. దీంతో వారిద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. చాలా మంది వారిని ఆపడానికి ప్రయత్నించారు, కానీ వారిద్దరి గొడవ మాత్రం ఆపలేకపోయారు. ఈ వీడియో అప్‌లోడ్ చేసినప్పటి నుంచి దాదాపు 4లక్షల 60వేల వ్యూస్ ను దక్కించుకుంది.