సీపీఎస్ రద్దు కోసం వచ్చేనెల 3న చలో పార్లమెంట్

సీపీఎస్ రద్దు కోసం వచ్చేనెల 3న చలో పార్లమెంట్

హైదరాబాద్, వెలుగు: సీపీఎస్ విధానాన్ని రద్దు చేసి, పాత పింఛన్ విధానాన్ని పునరుద్ధరించాలని కోరుతూ ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల ఆధ్వర్యంలో నవంబర్‌‌‌‌ 3న చలో పార్లమెంట్ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు జంగయ్య, ప్రధాన కార్యదర్శి చావ రవి తెలిపారు. 

సీపీఎస్ రద్దుపై అన్ని రాజకీయ పార్టీలు తమ వైఖరిని స్పష్టం చేయాలని సోమవారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. దేశవ్యాప్తంగా ఎస్‌‌టీఎఫ్‌‌ఐ, సీసీజీఈడబ్ల్యూ, ఏఐఎస్జీఈఎఫ్, ఏఐఎస్జీపీఎఫ్ తదితర సంఘాల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టనున్నట్టు తెలిపారు. నవంబర్ 3న ఉదయం10 గంటల నుంచి సాయంత్రం 4 వరకు ఢిల్లీలోని రామ్ లీలా మైదాన్‌‌లో జరిగే కార్యక్రమంలో వేలాది మంది పాల్గొంటారని వెల్లడించారు.