అదానీ ఇష్యూపై ఉభయసభల్లో ఆగని రచ్చ..డిసెంబర్ 2కు రాజ్యసభ వాయిదా

అదానీ ఇష్యూపై ఉభయసభల్లో ఆగని రచ్చ..డిసెంబర్ 2కు రాజ్యసభ వాయిదా

పార్లమెంట్ ఉభయ సభలు వాయిదాల పర్వ కొనసాగుతోంది. ప్రతి రోజు సెషన్స్  ప్రారంభం కావడం, అదానీ ఇష్యూపై విపక్షాలు ఆందోళనకు దిగడం..సభలను  వాయిదా వేయడం జరుగుతోంది. నవంబర్ 29న కూడా ఉభయ సభలు ప్రారంభం అయిన కాసేపటికే వాయిదా పడ్డాయి.  

 అదానీ లంచం ఆరోపణలపై చర్చ జరగాలంటూ  విపక్షాలు ఆందోళనకు దిగాయి. అదానీ ఇష్యూపై  జేపీసీ వేయాలని చర్చకు  పట్టబట్టాయి.  లోక్ సభ ప్రారంభమైన కాసేపటికే  విపక్షాలు ఆందోళన చేయడంతో స్పీకర్ సభను నవంబర్ 29న 12 గంటలకు వాయిదా వేశారు. అటు రాజ్యసభలోనూ ఇదే పరిస్థితి కొనసాగింది . విపక్షాల ఆందోళనతో రాజ్యసభను ఛైర్మన్ జగదీప్ ధన్కర్ డిసెంబర్ 2కు వాయిదా వేశారు.

Also Read:-భారీగా పెరుగుతున్న బంగారం, వెండి ధరలు నవంబర్ 29న రేట్లు ఇవే..