సాయంత్రం పారికర్ అంత్యక్రియలు : గోవాకు ప్రధాని

సాయంత్రం పారికర్ అంత్యక్రియలు : గోవాకు ప్రధాని

గోవా : పనాజీలోని బీజేపీ ఆఫీస్ లో దివంగత సీఎం మనోహర్ పారికర్ భౌతికకాయానికి బీజేపీ అగ్రనేతలు, పార్టీ కార్యకర్తలు నివాళులు అర్పిస్తున్నారు. వేలాది మంది పారికర్ ను కడసారి చూసేందుకు వస్తున్నారు. పారికర్ కు కడసారి నివాళులు అర్పించేందుకు ఈ ఉదయం ఢిల్లీనుంచి బయల్దేరి పనాజీకి చేరుకున్నారు ప్రధానమంత్రి నరేంద్రమోడీ.

రక్షణశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గోవాకు చేరుకున్నారు. కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ.. పారికర్ భౌతిక కాయానికి నివాళులు అర్పించి, కుటుంబ సభ్యులను ఓదార్చారు..

పార్టీ ఆఫీస్ నుంచి కాసేపట్లో భౌతిక కాయాన్ని కళా అకాడమీకి తీసుకెళ్తారు. ప్రజలు నివాళులు అర్పించేందుకు సాయంత్రం 4 గంటల వరకు అక్కడే ఉంచనున్నారు. మనోహర్ పారికర్ అంత్యక్రియలు మిరామర్ బీచ్ ప్రాంతంలో పూర్తి సైనిక లాంఛనాలతో జరగనున్నాయి. ఇందుకోసం ఏర్పాట్లు పూర్తయ్యాయి.

మార్చి 18 నుంచి 24 వరకు గోవాలో సంతాప దినాలు కొనసాగనున్నాయి. పారికర్ భౌతికకాయం దగ్గర  భారత్ మాతాకీ జై అంటూ నినాదాలు చేశారు బీజేపీ కార్యకర్తలు. గోవాను మనోహర్ పారికర్ పూర్తిస్థాయిలో అభివృద్ధి చేశారని గుర్తు చేసుకున్నారు గోవా ప్రజలు. రక్షణశాఖ మంత్రిగానూ అద్భుత విజయాలు సాధించారని గుర్తు చేసుకున్నారు.