తిరుమలలో వైభవంగా పార్వేట ఉత్సవం

తిరుమలలో  వైభవంగా పార్వేట ఉత్సవం

తిరుపతి శ్రీనివాసమంగాపురం శ్రీకల్యాణ వేంకటేశ్వరస్వామి పార్వేట ఉత్సవం వైభవంగా జరిగింది. మంగళవారం  అక్టోబర్  24 న  ఉత్సవమూర్తుల ఊరేగింపు.. శ్రీవారిమెట్టు సమీపంలోని పార్వేట మండపానికి చేరింది. శ్రీనివాసమంగాపురం శ్రీకల్యాణవేంకటేశ్వరస్వామి పార్వేట ఉత్సవం శ్రీవారి మెట్టు సమీపంలో వైభవంగా జరిగింది. అక్కడ క్షేమతలిగ నివేదన చేసి పార్వేట ఉత్సవం నిర్వహించారు. ఇందులో దుష్టశిక్షణ కోసం స్వామివారు మూడు సార్లు బళ్లెంను ప్రయోగించారు.

తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి పార్వేట ఉత్సవంలో భాగంగా శ్రీమలయప్పస్వామివారు తిరుచ్చిలో వేంచేసారు. వారి వెంట మరో తిరుచ్చిపై శ్రీ కృష్ణస్వామి వేంచేసారు.అనంతరం పార్వేట మండపము నందు పుణ్యాహము, ఆరాధన, నివేదనము జరిగి హారతులు జరిగాయి. అనంత‌రం ఉభయదార్లకు తాళ్ళపాక వారికి, మఠంవారికి మర్యాదలు జరిగాయి.శ్రీ కృష్టస్వామివారిని సన్నిధి యాద‌వ పూజ చేసిన చోటుకు వేంచేపుచేసి పాలు, వెన్న, హారతులు సమర్పించారు.

Also Read:60 యేళ్ల నాటి బ్యాంక్ పాస్బుక్

అనంతరం సాయంత్రానికి స్వామివారి ఉత్సవమూర్తులను తిరిగి ఆలయానికి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా టీటీడీ అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో కళాకారులు భక్తి సంకీర్తనలు ఆలపించారు. భజన బృందాలు భజనలు, కోలాటాలు చేశారు. అనంతరం భక్తులకు అన్నప్రసాదాలు పంపిణీ చేశారు.  శ్రీ మలయప్పస్వామివారు ఉత్సవము పూర్తియి మహాద్వారమునకు వచ్చి హత్తీరాంజీవారి బెత్తమును తీసుకొని సన్నిధిలోనికి వేంచేసారు. ఇంతటితో ఎంతో వేడుకగా పార్వేట ఉత్సవము ఘనంగా ముగిసిందని టీటీడీ ప్రకటించింది.