ప్రియాంక ఎలా చనిపోయిందో తల్లికి చెప్పిన పాషా

ప్రియాంక ఎలా చనిపోయిందో తల్లికి చెప్పిన పాషా

ప్రియాంక హత్య దేశం యావత్తు సంచలనం రేపింది. పనిమీద బయటకు వెళ్లి వస్తున్న డాక్టర్ ప్రియాంకను అడ్డగించి అత్యాచారం చేసి, హత్య చేసిన నిందితులను షాద్ నగర్ పోలీస్ స్టేషన్‌లో వైద్య పరీక్షల నిమిత్తం ఉంచారు. అక్కడికి చేరుకున్న స్థానికులు.. నిందితులను ఉరితీయాలంటూ నినాదాలు చేస్తున్నారు. పబ్లిక్ పోలీస్ స్టేషన్‌లోకి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. వారిని కట్టడి చేయలేక పోలీసులు ఇబ్బందులు పడుతున్నారు. పబ్లిక్ ఏ సమయాన పోలీస్ స్టేషన్ మీద దాడిచేస్తారోనని పోలీసులు కట్టుదిట్ట చర్యలు తీసుకుంటున్నారు. షాద్ నగర్‌లో పరిస్థితి ఇలా ఉంటే.. మరి నిందితుల తల్లులు ఎలా అభిప్రాయపడుతున్నారో చూద్దాం.

MORE NEWS:

ఆ నలుగురే కాదు: వీళ్లు ముసుగేసుకున్న మృగాలు

షాద్ నగర్ కిరాతకుల్ని కుక్కలతో పోల్చిన వర్మ

ప్రియాంకను అత్యాచారం చేసి, హత్య చేసిన వాళ్లలో ప్రధాన నిందితుడు మహ్మద్ పాషా.. ప్రియాంక హత్య గురించి తన తల్లికి చెప్పాడు. తమ పిల్లలు తప్పు చేస్తే ఏ శిక్ష వేసినా సమ్మతమే అంటున్నారు నిందితుల తల్లులు.

పాషా తల్లి
‘ఘటన జరిగిన రోజు.. రాత్రి ఒంటి గంటకు ఆరిఫ్ ఇంటికి వచ్చాడు. స్కూటీపై వస్తున్న అమ్మాయికి ఆక్సిడెంట్ చేశానని చెప్పాడు. ఆ అమ్మాయి చనిపోయిందని చెప్పాడు. నా కొడుకు చేసిన పనికి శిక్ష పడేలా చేయండి.’

శివ తల్లి మణెమ్మ
శివ ఆరో తరగతి వరకు ఊళ్లోనే చదివాడు. చిన్నప్పటి నుంచి అందరితో మంచిగానే ఉండేవాడు. నాకు బిడ్డలు ఉన్నరు. ఎవరైనా ఆడపిల్లలే. దోస్తుల వల్లే మావాడు ఇలా చేశాడు. ఆ రోజు ఇంటికి వచ్చి స్నానం చేసి పండుకున్నడు. పోలీసులు రాత్రి 2:30 కి వచ్చి శివని తీసుకుపోయారు. నా కొడుకు తప్పు చేస్తే వదలకండి.

నవీన్ తల్లి లక్ష్మీ
మా వాడు తప్పు చేస్తే ఏ శిక్ష అయినా వేయండి. ఎవరి పిల్లలయినా పిల్లలే. నేను మాత్రమే పిల్లల్ని కన్నానా. వాళ్లు కనలేదా. చంపుతరో, ఉరితీస్తరో మీ ఇష్టం.

చెన్న కేశవులు తల్లి జయమ్మ
మా వాడికి పెళ్లై ఆరు నెల్లైంది. ఇష్టపడి పెళ్లి చేసుకున్నాడు. ఆ రోజు రాత్రి 10 గంటలకు ఇంటికి వచ్చి పడుకున్నాడు. లారీ డ్రైవర్ మా ఇంటికి వచ్చి కేశవ్‌ని తీసుకుపోయిండు. పోలీసులు రాత్రి 2 గంటలకు వచ్చి మావాన్ని తీసుకుపోయారు. మావాణికి కిడ్నీ జబ్బు ఉంది. మందుల కోసం పాలమూరు, హైదరాబాద్ వారానికోసారి తిరుగుతాం. మావాడు తప్పు చేస్తే ఏ శిక్ష అయినా వేయండి. ఆ అమ్మాయిని కాల్చినట్లు మావాడిని కూడా కాల్చండి.
మాకు వదిలేయండి, మేము చూసుకుంటాం…షాద్ నగర్ లో టెన్షన్ టెన్షన్….