ప్యాసెంజర్ మాస్క్ పెట్టుకోలేదని ఫ్లైట్ నే వెనక్కి మళ్లించారు
V6 Velugu Posted on Jan 21, 2022
ప్రపంచంలో కరోనా కేసులు మరోసారి విపరీతంగా పెరుగుతున్నాయి. దాంతో ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించాలని ఆయా దేశాలు నిబంధన విధించాయి. బస్సులు, విమానాల్లో ప్రయాణించే వారు కూడా మాస్కులు కచ్చితంగా పెట్టుకోవాల్సిందేనని రూల్ తీసుకొచ్చారు. అయితే తాజాగా ఓ విమానంలో ప్రయాణిస్తున్న వ్యక్తి మాస్క్ పెట్టుకోవడానికి నిరాకరించాడు. దాంతో ఏకంగా విమానాన్నే వెనక్కి మళ్లించారు. ఈ ఘటన అమెరికన్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన జెట్‌లైనర్ విమానంలో గురువారం చోటుచేసుకుంది. 129 మంది ప్రయాణికులతో మియామి నుంచి లండన్‌కు బయలుదేరిన ఫ్లైట్ 38లో ఓ ప్రయాణికుడు మాస్క్ ధరించలేదు. దాంతో ఎయిర్ హోస్టెస్ సదరు వ్యక్తిని మాస్క్ వేసుకోవాలని సూచించారు. కానీ ఆ వ్యక్తి మాత్రం మాస్క్ ధరించడానికి అంగీకరించలేదు. దాంతో చేసేదేమీ లేక విమాన క్రూ.. విమానాన్ని తిరిగి మియామికి మళ్లించారు. క్రూ సమాచారంతో ఎయిర్‌పోర్ట్‌లో సిద్దంగా ఉన్న పోలీసులు.. విమానం ల్యాండ్ అవగానే ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. తదుపరి విచారణ పెండింగ్‌లో ఉందని అమెరికన్ ఎయిర్‌లైన్స్ తెలిపింది. అంతేకాకుండా.. మాస్క్ పెట్టుకోని ఈ ప్రయాణికుడిని ఎయిర్‌లైన్స్‌లో ప్రయాణించకుండా నిరోధించబడిన వ్యక్తుల జాబితాలో ఉంచుతామని వెల్లడించింది.
For More News..
‘నల్లమల’ నుంచి మరో సాంగ్ రిలీజ్
Tagged London, corona virus, Mask, face mask, mask rule, miami, american jetliner, Federal Aviation