‘నల్లమల’ నుంచి మరో సాంగ్ రిలీజ్
V6 Velugu Posted on Jan 21, 2022
ఇప్పటి వరకు నెగిటివ్ రోల్స్‌తో అందరినీ ఆకట్టుకున్న అమిత్ తివారీ ‘నల్లమల’ చిత్రంతో హీరోగా మారుతున్నాడు. భానుశ్రీ, నాజర్, తనికెళ్ల భరణి, అజయ్ ఘోష్, కాలకేయ ప్రభాకర్ ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రం నల్లమల అడవి చుట్టూ జరిగిన ఎన్నో చీకటి కోణాలను ఆసక్తికరంగా చూపిస్తుందంటున్నాడు దర్శకుడు రవిచరణ్. ఆర్.ఎమ్. నిర్మిస్తున్న ఈ మూవీ నుంచి ఇప్పటికే కొన్ని పాటలు విడుదలయ్యాయి. ఇప్పుడు కాలభైరవ పాడిన ‘మన్నిస్తారా మూగజీవులారా’ అనే పాటను కె.రాఘవేంద్రరావు రిలీజ్ చేశారు.
ఈ సందర్భంగా రాఘవేంద్రరావు మాట్లాడుతూ ‘ఈ పాటను దర్శకుడు చాలా బాగా తీశాడు. జంతువుల పట్ల మనం ఎంత అమానుషంగా ఉంటున్నామో ఈ పాట చూస్తే అర్థమవుతుంది. మూవీ ప్రోమోస్ చూస్తున్నాను. కొత్త బ్యాక్‌డ్రాప్‌లో ఇంటరెస్టింగ్‌గా అనిపిస్తోంది’ అంటూ టీమ్‌కి ఆల్ ద బెస్ట్ చెప్పారు.