విమానం ల్యాండ్ కావడానికి ముందు ఎమర్జెన్సీ డోర్ ఓపెన్ చేసిన ప్రయాణికుడు

విమానం ల్యాండ్ కావడానికి ముందు ఎమర్జెన్సీ డోర్ ఓపెన్ చేసిన ప్రయాణికుడు

ఆసియానా ఎయిర్‌లైన్స్ విమానంలోని ఒక ప్రయాణికుడు తనకు "అసౌకర్యంగా" ఉన్న కారణంతో దక్షిణ కొరియాలోని డేగులో ల్యాండ్ కావడానికి నిమిషాల ముందు ఎమర్జెన్సీ డోర్ ను ఓపెన్ చేశాడు. ఈ ఘటన మే 26న జరిగినట్టు యోన్‌హాప్ న్యూస్ ఏజెన్సీ నివేదించింది.

ముప్ఫై ఏళ్ల వయస్సులో ఉన్న వ్యక్తి.. అతను విమానం నుంచి త్వరగా దిగాలనే ఆత్రుతతో  తలుపు తెరిచినట్లు పోలీసులకు చెప్పాడు, ఇటీవల ఉద్యోగం కోల్పోవడంతో ఒత్తిడికి లోనయ్యానని పోలీసులకు తెలిపాడు. విమానం భూమికి దాదాపు 700 అడుగుల (213మీ) ఎత్తులో ఉన్నప్పుడు ఆ వ్యక్తి తలుపు తెరిచాడు. దీంతో విమానంలోని ప్రయాణికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు.

శ్వాసకోశ సమస్యలతో తొమ్మిది మంది ప్రయాణికులను ఆస్పత్రికి తరలించారు. దాదాపు రెండు గంటల తర్వాత వారందరినీ ఆసుపత్రి నుంచి తొలగించినట్లు అగ్నిమాపక శాఖ అధికారి తెలిపారు. విచారణ ముగిసిన తర్వాత అదుపులోకి తీసుకున్న వ్యక్తిని అరెస్టు చేయాలని పోలీసులు యోచిస్తున్నారని యోన్‌హాప్ చెప్పారు.