920 ట్రిప్పుల్లో 19వేల మంది జర్నీ.. ఫస్ట్ డే అంతంతే..

920 ట్రిప్పుల్లో 19వేల మంది జర్నీ.. ఫస్ట్ డే అంతంతే..

హైదరాబాద్, వెలుగుఅన్ లాక్ 4తో ట్రాక్​ ఎక్కిన మెట్రో రైల్​కి తొలి రోజు పెద్దగా రెస్పాన్స్​ రాలేదు. 4 నెలల తర్వాత మెట్రో అందుబాటులోకి వచ్చినా ప్యాసింజర్స్​ లేక స్టేషన్లు వెలవెలబోయాయి. ఎల్​బీనగర్​– మియాపూర్ కారిడార్​లో సోమవారం ఉదయం 7 నుంచి 12 గంటల్లోపు 120 ట్రిప్పులు, సాయంత్రం 4 నుంచి రాత్రి 9 గంటల్లోపు 800 ట్రిప్పులు తిప్పగా, 19 వేల మంది జర్నీ చేసినట్లు అధికారులు తెలిపారు.

పీక్​ అవర్స్​లోనూ ఖాళీగా..

ఎక్కువ దూరం ఉండే ఎల్​బీనగర్ –-మియాపూర్​ కారిడార్​లోని 27స్టేషన్లలో భరత్ నగర్, మూసాపేట్ స్టేషన్లు మినహా అన్ని స్టేషన్లూ ఓపెన్ అయ్యాయి. ఒక్కో ట్రైన్ లో 300 మంది ప్రయాణించేలా మెట్రో సీటింగ్ ఆరెంజ్ మెంట్, స్టాండింగ్ ఏర్పాట్లు చేయగా.. 50మంది కూడా ప్రయాణించ లేదు. కాలేజీలు, ఆఫీసులు పూర్తిస్థాయిలో ఓపెన్​ అవకపోవడం, ఎక్కువమంది ఎంప్లాయ్స్​ వర్క్​ ఫ్రమ్​ హోమ్​ చేస్తుండడమూ ఒక కారణం. సిటీలో ఓన్​ వెహికల్స్ యూజేస్​ కూడా పెరిగింది. ఉదయం 7 గంటల నుంచే మెట్రో మొదలవగా, పీక్ అవర్ లో రద్దీగా ఉండే స్టేషన్లన్నీ ఖాళీగా కనిపించాయి. సిటీ శివారు ప్రాంతాలకు వెళ్లాల్సినవారే మెట్రోలో ఎక్కువమంది ప్రయాణించారు.

సేఫ్టీకి ప్రయారిటీ

స్టేషన్లు, ట్రైన్స్​లో అధికారులు సేఫ్టీ ప్రికాషన్స్​ తీసుకున్నారు. శానిటేషన్, థర్మల్ ​స్క్రీనింగ్​తర్వాతే ప్యాసింజర్స్​ని అనుమతించారు. మాస్క్ మస్ట్​ చేశారు. రైళ్లలో ఫిజికల్​ డిస్టెన్స్ కోసం సీటింగ్, స్టాండింగ్ పాయింట్ గుర్తులు  వేయించారు. ఎస్కలేటర్లు, లిఫ్ట్​లు ఓపెన్ చేయలేదు. ట్రైన్ అద్దాలకు ఉన్న స్టిక్కర్లను లోపల వెంటిలేషన్ కోసం తొలగించారు. ఎయిర్ ఫ్లోకు ప్రత్యేక చర్యలు తీసుకున్నారు.

పార్కింగ్ చార్జీల భారం

మెట్రో జర్నీలో పార్కింగ్ చార్జీలు భారంగా మారుతున్నాయని ప్రయాణికులు వాపోతున్నారు. మొదట్లో ఫ్రీ పార్కింగ్ ఫెసిలిటీ కల్పిస్తామన్న మెట్రో వర్గాలు.. ఆ తర్వాత సింగిల్ డేకి టైమ్​ని బట్టి రూ.10–-20, నెలకు రూ.300 వసూలు చేసేవారు. సోమవారం మాత్రం మంత్లీ కార్డు కోసం రూ.400 నుంచి వసూలు చేసినట్లు ప్యాసింజర్స్​ తెలిపారు. మెట్రో అధికారులు మాత్రం పాత చార్జీలే కొనసాగుతున్నాయని తెలిపారు. సంస్థ ప్రమేయం లేకుండానే పార్కింగ్ నిర్వాహకులు అదనంగా వసూలు చేస్తున్నారని కంప్లయింట్స్​వస్తున్నాయి.

సిటీ బస్సులపై సందిగ్ధం

సామాన్యుడికి తక్కువ ధరలో రవాణా సేవలందించే సిటీ బస్సుల కోసం జనం ఎదురుచూస్తున్నారు. మెట్రో తర్వాత సిటీ బస్సులు స్టార్ట్​ అవుతాయని ఆశపడ్డా, ఆ దిశగా ఎలాంటి చర్యలూ కనిపించడం లేదు. బస్సులు నడిపేందుకు గ్రేటర్​ఆర్టీసీ రెడీగా ఉన్నా, ప్రభుత్వ అనుమతుల కోసం ఎదరుచూస్తున్నారు.

నేడు నాగోల్రాయదుర్గం..

సెకండ్ ఫేజ్​లో భాగంగా నాగోల్ – రాయదుర్గం కారిడార్​లో మంగళవారం మెట్రో సేవలు అందుబాటులోకి రానున్నాయి. 23 కిలోమీటరున్న ఈ రూట్​లో యూసుఫ్ గూడ తప్ప అన్ని స్టేషన్లూ ఓపెన్​ చేయనున్నారు. మామూల్లో రోజుల్లో అత్యధికంగా రద్దీ ఉంటే మార్గమిది. ప్రస్తుతం ఐటీ కారిడార్ ఎంప్లాయ్స్​లో దాదాపు 70 శాతం మంది వర్క్ ఫ్రం హోం చేస్తున్నారు. మిగిలిన వాళ్లు ఓన్​ వెహికల్స్​ వాడుతున్నారు. దాంతో ఈ రూట్​లోనూ పెద్దగా రెస్పాన్స్​ ఉండకపోవచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.