
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మపై ఆస్ట్రేలియా కెప్టెన్ పాట్ కమ్మిన్స్ ప్రశంసల వర్షం కురిపించాడు. తొలి టెస్టులో రోహిత్ శర్మ అసాధారణ ఇన్నింగ్స్ ఆడాడని కొనియాడాడు. వికెట్ పిచ్పై రోహిత్ శర్మ ఆద్బుతంగా ఆడి సెంచరీ చేశాడని చెప్పాడు. రోహిత్ సెంచరీతో తమను ఒత్తిడిలోకి నెట్టాడని తెలిపాడు. మ్యాచ్ అనంతరం ఓటిమికి గల కారణాలను వెల్లడించిన పాట్ కమ్మిన్స్..తొలి ఇన్నింగ్స్లో తాము మరో 100 పరుగులు చేసి ఉంటే బాగుండేదన్నాడు.
నాగ్ పూర్ టెస్టులో టీమిండియా అద్భుతంగా ఆడిందని పాట్ కమ్మిన్స్ మెచ్చుకున్నాడు. గేమ్ వేగంగా సాగుతున్నప్పుడు..ఆటగాళ్లు ఆ వేగాన్ని అందుకోవాలన్నాడు. ఇందులో భారత జట్టు తమకంటే ముందుందన్నాడు. టర్నింగ్ వికెట్లపై భారత స్పిన్నర్లు అద్బుతంగా రాణించారని ప్రశంసించాడు.
తొలి ఇన్నింగ్స్లో భారత్ భారీ స్కోరు చేసి తమను ఒత్తిడిలోకి నెట్టిందని కమ్మిన్స్ అభిప్రాయపడ్డాడు. తొలి ఇన్నింగ్స్లో తమ జట్టులో ముగ్గురు, నలుగురు ఆటగాళ్లు బ్యాటింగ్ చేసేందుకు ప్రయత్నించారని..అయితే తమ ఇన్నింగ్స్ను భారీ స్కోర్లుగా మలచలేకపోయారన్నాడు. ఇక టాడ్ మర్ఫీ అరంగేట్రంలోని అద్భుతంగా బౌలింగ్ చేశాడని కొనియాడాడు.