
పటాన్‌చెరూ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డికి కరోనా సోకింది. ఆయనతో పాటు ఆయన తల్లి, తమ్ముడు, పీఏ, గన్‌మెన్‌లకు కరోనా సోకింది. మహిపాల్ రెడ్డి ప్రస్తుతం అపోలో హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు. సంగారెడ్డి జిల్లాలో ఆదివారం రాత్రి 8 గంటల వరకు కొత్తగా 37 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దాంతో ఇప్పటివరకు జిల్లాలో నమోదయిన మొత్తం కేసుల సంఖ్య 2078 కి చేరింది. రాష్ట్రంలో ఈరోజు 983 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటివరకు కరోనా కేసుల సంఖ్య 67,660కి చేరింది.
For More News..