కేసీఆర్ తోనే బంగారు తెలంగాణ: పట్లోళ్ల కార్తీక్ రెడ్డి 

కేసీఆర్ తోనే బంగారు తెలంగాణ: పట్లోళ్ల కార్తీక్ రెడ్డి 

శంకర్ పల్లి, వెలుగు: బంగారు తెలంగాణ సీఎం కేసీఆర్ తోనే సాధ్యమని చేవెళ్ల బీఆర్ఎస్ ఎన్నికల ఇన్ చార్జ్ పట్లోళ్ల కార్తీక్ రెడ్డి అన్నారు. ఆదివారం శంకర్ పల్లి టౌన్ లో పార్టీ ఆఫీసును ఎమ్మెల్యే అభ్యర్థి యాదయ్యతో కలిసి ప్రారంభించారు. అనంతరం కార్తీక్ రెడ్డి మాట్లాడుతూ.. ఎమ్మెల్యే యాదయ్య చేవెళ్లను అభివృద్ధి చేశారని, వచ్చే ఎన్నికల్లో కారు గుర్తుపై ఓటు వేసి మూడోసారి గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ విజయలక్ష్మి, ఎంపీపీ గోవర్ధన్ రెడ్డి, ఏఎంసీ చైర్మన్ పాపారావు, పీఏసీఎస్ చైర్మన్ శశిధర్ రెడ్డి, నేతలు ప్రవీణ్, గోపాల్ రెడ్డి, వాసుదేవ్, పాండు తదితరులు పాల్గొన్నారు.

ఎమ్మెల్యేను అడ్డుకున్న గ్రామస్తులు

శంకర్ పల్లి మండలం మహాలింగాపురంలో ఎన్నికల ప్రచారం లో భాగంగా ఎమ్మెల్యే యాదయ్య పర్యటించగా గ్రామస్తులు ఆడ్డుకున్నారు. తమ గ్రామంలో ఎలాంటి అభివృద్ధి చేయలేదని, అడిగిన ప్రతిసారి చేస్తామంటూ దాటవేశారని మండిపడ్డారు. గ్రామస్తులు పెద్ద ఎత్తున నినాదాలు చేయడంతో యాదయ్య తన ప్రచారాన్ని ఆపి వేసి అక్కడి నుంచి వెళ్లిపోయారు.