మహబూబాబాద్ ఏరియా ఆస్పత్రిలో కరెంట్ కట్

 మహబూబాబాద్ ఏరియా ఆస్పత్రిలో కరెంట్ కట్
  • ఉక్కపోతతో రోగుల తిప్పలు.. సిబ్బందిపై బంధువుల ఆగ్రహం

మహబూబాబాద్ జిల్లా హాస్పిటల్ లో కరెంట్ కోతలతో పేషెంట్స్ ఇబ్బంది పడుతున్నారు. మరమ్మత్తుల పేరుతో విద్యుత్ సరఫరా నిలిపివేయడంతో రోగులు కష్టాలు పడుతున్నారు.  పేపర్ ప్యాడులతో గాలి విసురుకుంటున్నారు. చివరకు ఐసీయూలో పేషెంట్లకు కూడా అదే పరిస్థితి ఉండటంతో రోగుల బంధువులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.  ఏరియా హాస్పిటల్ ను..జిల్లా హాస్పిటల్ గా ఆప్ గ్రేడ్ చేశారు. ఈనెల 10న ఆరోగ్యశాఖ మంత్రి హరీష్ రావు హాస్పిటల్ లో కొత్తగా నిర్మించిన బ్లాక్ ను ప్రారంభించారు. పేషెంట్స్ కు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూసుకోవాలని అధికారులను ఆదేశించారు. కానీ అధికారులు మాత్రం రోగుల బాధలు పట్టించుకోవడం లేదు. ప్రత్యామ్యాయ ఏర్పాట్లు లేకుండానే పవర్ కట్ చేస్తున్నారు. దీంతో రోగులు గాలి కోసం  పేపర్ ప్యాడ్లను విసురుకుంటున్నారు.

 

 

ఇవి కూడా చదవండి

15రోజులైనా ధాన్యం కొనలేదని రైతు ఏం చేశాడంటే..

అవినీతి చేస్తున్నారని తెలిసినా ఎందుకు అరెస్టు చేయరు?

‘సైకిల్’కు మళ్లీ పెరుగుతున్న క్రేజ్