అవినీతి చేస్తున్నారని తెలిసినా ఎందుకు అరెస్టు చేయరు?

అవినీతి చేస్తున్నారని తెలిసినా ఎందుకు అరెస్టు చేయరు?

అవినీతి  చేస్తున్నారని  తెలిసి  కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ ను  ఎందుకు అరెస్ట్  చెయ్యడంలేదని కేంద్ర హోం మంత్రి  అమిత్ షా పై  వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ చీఫ్ వైఎస్ షర్మిల మండిపడ్డారు. ప్రతి పథకంలో  కేంద్రం వాటా  ఉందని అమిత్ షా అంటున్నారని.... అయితే కేసీఆర్ అవినీతిలో మీకు వాటా లేదా  అని ప్రశ్నించారు. ఒక వైపు ప్రజాస్వామ్య బద్దంగా నరసన తెలుపుతున్న రైతులను కార్లతో గుద్ది చంపి... ఇంకో వైపు రైతాంగాన్ని  ఆదుకుంటామని చెబుతూ  చెవిలో పూలు  పెడుతున్నారని షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు.  చట్టబద్ధంగా ఇచ్చిన  విభజన హామీలు ఏడేళ్లు దాటినా  నెరవేర్చలేదన్నారు. ఇప్పుడు  ఏ మొహం పెట్టుకొని  ఒక్క చాన్స్ ఇమ్మని అడుగుతున్నారని  విమర్శించారు.