
కేసీఆర్ చేసిన తప్పుల వల్లే బీఆర్ఎస్ పార్టీకి ఈ దుస్థితి వచ్చిందని.. నేతలు అందరూ పార్టీలు మారుతున్నారంటూ పార్టీ సమావేశంలో ఈ వ్యాఖ్యలు చేశారు సబితా ఇంద్రారెడ్డి కుమారుడు పటోళ్ల కార్తీక్ రెడ్డి. కేశవరావును పక్కన కూర్చోబెట్టుకుని పెద్ద తప్పుచేశారని.. రాజ్యసభ ఎంపీగా పంపించటం మరో పెద్ద తప్పంటూ కేసీఆర్ వైఖరిని ఎత్తిచూశారు కార్తీక్ రెడ్డి.
కేశవరావుతోపాటు ఆయన కుమార్తెకు రెండుసార్లు కార్పొరేట్ టికెట్ ఇవ్వటమే కాకుండా హైదరాబాద్ మేయర్ చేశారని.. బంజారాహిల్స్ ఎక్కడ ఉందో తెలియని ఆమెను కీలక పదవులు ఇవ్వటం వల్లే పార్టీ ఈ స్థాయికి దిగజారిందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు కార్తీక్ రెడ్డి.
కడియం శ్రీహరికి మంచి స్థానం ఇచ్చారని.. ఎంతో గుర్తింపు ఇచ్చినా ఇప్పుడు పార్టీ మరుతున్నారంటే దానికి కారణం కేసీఆర్ చేసిన తప్పులే కదా అని చేవెళ్లు ఎంపీ నియోజకవర్గం సమీక్ష సమావేశంలోనే.. నేతలు, కార్యకర్తల ఎదుటే ఈ వ్యాఖ్యలు చేయటం పార్టీలో పరిస్థితిని చెప్పకనే చెబుతోంది. వాళ్లకు అంత గుర్తింపు ఇచ్చినా వాళ్లు పార్టీ మారారు అని.. నాకు ఎలాంటి పదవులు ఇవ్వకపోయినా.. పార్టీనే నమ్ముకుని ఉన్నా అంటూ చెప్పుకొచ్చారు పటోళ్ల కార్తీక్ రెడ్డి.
కేసీఆర్ దగ్గర అధికారం లేకపోవటం వల్లే అందరూ పార్టీ మారుతున్నారని.. అదే బీఆర్ఎస్ పార్టీ గెలిచి ఉంటే పార్టీ మారే వారా అని ప్రశ్నిస్తూ.. సమీక్ష సమావేశాన్ని హాట్ హాట్ గా మార్చారు పటోళ్ల కార్తీక్ రెడ్డి.