విద్య, ఉద్యోగాల్లో 65 శాతం రిజర్వేషన్లను కొట్టివేసిన పాట్నా హైకోర్టు

విద్య, ఉద్యోగాల్లో 65 శాతం రిజర్వేషన్లను కొట్టివేసిన పాట్నా హైకోర్టు

బీహార్ లో నితీశ్ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది.  వెనుకబడిన తరగతులు, ఈబీసీలు, ఎస్సీలు & ఎస్టీలకు 65 శాతం రిజర్వేషన్లను పాట్నా హైకోర్టు రద్దు చేసింది.

బీహార్ లో నితీశ్ ప్రభుత్వం  ఓబీసీ, ఈబీసీ, దళితులు, గిరిజనులకు రిజర్వేషన్లను 50 నుంచి 65 శాతానికి పెంచిన సంగతి తెలిసిందే..బీహార్‌ ప్రభుత్వ నిర్ణయంపై  హైకోర్టును   ఆశ్రయించారు పలువురు పిటిషనర్లు. మార్చిలో తీర్పు రిజర్వ్ చేసిన  పాట్నా హైకోర్టు.. 65 శాతానికి రిజర్వేషన్ల పెంపు రాజ్యాంగ విరుద్ధమంటూ  ఇవాళ కొట్టి వేసింది. 

బిహార్ లో  పోస్టులు సేవల (సవరణ) చట్టం 2023,  బీహార్ (విద్యా సంస్థల్లో ప్రవేశంలో) రిజర్వేషన్ (సవరణ) చట్టం, 2023 రాజ్యంగ విరుద్ధమంటూ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కె వినోద్ చంద్రన్, జస్టిస్ హరీష్ కుమార్‌లతో కూడిన డివిజన్ బెంచ్ తీర్పు చెప్పింది. రాజ్యాంగానికి విరుద్ధంగా ఆర్టికల్ 14, 15, 16 ప్రకారం నిబంధనలను ఉల్లంఘిస్తుందని తెలిపింది.