హైదరాబాద్, వెలుగు : తెలంగాణకు చెందిన పారా షూటర్లు పావని బనోత్, సత్య జనార్దన వరల్డ్ పారా షూటింగ్ చాంపియన్‌షిప్‌లో బ్రాంజ్ మెడల్‌తో మెరిశారు. ఢిల్లీలో మంగళవారం జరిగిన ఆర్11 మిక్స్‌డ్ టీమ్ 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ఎస్‌హెచ్2 కేటగిరీలో ఈ పతకం సాధించారు. బ్రాంజ్ మెడల్ మ్యాచ్‌లో ఈ ఇద్దరూ.. న్యూజిలాండ్ జంటపై గెలిచారు.
