ఆగస్టు 30 నుంచి మూడురోజులు ఇంద్రకీలాద్రిపై ఆర్జిత‌ సేవలు బంద్.. ఎందుకంటే

ఆగస్టు 30 నుంచి మూడురోజులు ఇంద్రకీలాద్రిపై  ఆర్జిత‌ సేవలు  బంద్.. ఎందుకంటే

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh ) విజయవాడలోని సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఇంద్రకీలాద్రిపై ఈ నెల 30 నుంచి సెప్టెంబరు 1 వరకు పవిత్రోత్సవాలు (Pavitrotsavalu) నిర్వహించనున్నారు. ఈ మూడు రోజుల పాటు జరగనున్న పవిత్రోత్సవాల సందర్భంగా‌ ఈ నెల 30 తెల్లవారుజామున 3 గంటలకు అమ్మవారి సుప్రభాతం, స్నపనాభిషేకం నిర్వహిస్తారు.  పవిత్రోత్సవాల సందర్భంగా మూడు రోజుల పాటు అన్ని ఆర్జిత సేవలు రద్దు చేశారు. 

బుధవారం ( ఆగస్టు 30)  నుంచి లోక కళ్యాణార్ధం, భక్తజన శ్రేయస్సు కోసం విజయవాడలోని ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మ ఆలయంలో పవిత్రోత్సములు స్టార్ట్ కానున్నాయి.   మూడు రోజుల పాటు ఆలయంలో జరిగే అన్ని ప్రత్యక్ష పరోక్ష సేవలను ఆలయాధికారులు నిలిపేశారు.  సెప్టెంబర్ 1వ తారీఖు వరకు ఇంద్రకీలాద్రిపై ఈ పవిత్రోత్సము కొనసాగనున్నాయి.  మంగళవారం ( ఆగస్టు 29) ఉదక శాంతితో ఉత్సవాలు ప్రారంభమయ్యి.. రేపు తెల్లవారు జామున ( ఆగస్టు 30) 3 గంటలకు దుర్గమ్మకు సుప్రభాత సేవ, అనంతరం స్నాపనభిషేకం, నిత్యా అలంకరణ, పవిత్రాల ధారణ జరుగనుంది. అనంతరం చండీహోమం, యాగా శాల దగ్గర   గణపతి పూజ, మండపారాధన అగ్నిప్రతిష్టంభన, దేవతారాధన జరుగతాయి. దీంతో( ఆగస్టు 30)  9 గంటల నుంచి భక్తులకు దుర్గమ్మ దర్శనానికి పర్మిషన్ ఇస్తారు.

  రేపు( ఆగస్టు 30)  సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల వరకు మూలా మంత్ర వాహనములు, వేద పారాయణములు, హారతి, మంత్ర పుష్పము జరుగనుంది. అయితే, ఈ నెల 31వ తేదీన ఉదయం 8 గంటల నుంచి 11 గంటల వరకు మండపారాధన, సర్వప్రాయశ్చిత విధి తాతావ్ దేవతారాధన.. సాయంత్రం 4 గంటల నుంచి ఆరు గంటల వరకు మూలా మంత్ర వాహనములు, వేద పారాయణములు, హారతి , మంత్ర పుష్పము యధావిధిగా కొనసాగనుంది. చివరి రోజు (సెప్టెంబర్ 1వ తేదీ) 10:30కు పుర్ణాహుతి కలశోద్వాసన, మార్జన, మహదాశీర్వచనము కార్యక్రమలతో ఈ పవిత్రోత్సవములు ముగియనున్నాయి. పవిత్రోత్సవాల సందర్భంగా రేపటి  ( ఆగస్టు 30) నుంచి సెప్టెంబరు ఒకటో తేదీ వరకు అన్ని ఆర్జిత‌ సేవలు రద్దు చేశారు. అమ్మవారి నిత్య కైంకర్యాలను దేవస్ధాన అర్చకులు నిర్వహించనున్నారు.