భీమవరం, గాజువాక నుంచి పవన్ పోటీ

భీమవరం, గాజువాక నుంచి పవన్ పోటీ

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ పోటీ చేసే నియోజకవర్గాలపై క్లారిటీ వచ్చింది. భీమవరం, గాజువాక నుంచి పవన్ బరిలో దిగనున్నారు. సుదీర్ఘ కసరత్తు తర్వాత జనసేన పార్టీ జనరల్ బాడీ పవన్ పోటీపై నిర్ణయించింది. పవన్ పోటీ చేసే స్థానాలపై క్లారిటీ రావడంతో ప్రచారాన్ని మరింత ముమ్మరం చేయనున్నారు జనసేన నాయకులు. మొదట  గాజువాక, పిఠాపురం నుంచి పోటీ చేస్తారని ఊహాగానాలు వినిపించాయి. చివరకు భీమవరం, గాజువాక ఫైనల్ అయ్యాయి. ఈ రెండు నియోజకవర్గాల్లో కాపు సామాజిక వర్గం ఓటు బ్యాంక్ పెద్ద సంఖ్యలో ఉందని చెబుతున్నారు. గతంలో చిరంజీవి కూడా పాలకొల్లు, తిరుపతి రెండు నియోజకవర్గాల్లో పోటీ చేయగా.. పాలకొల్లులో ఓడిపోయారు.