పవన్ వారాహి యాత్రలో తొలిరోజు బహిరంగ సభ... ఎక్కడంటే ..

పవన్ వారాహి యాత్రలో తొలిరోజు బహిరంగ సభ... ఎక్కడంటే ..

జనసేన అధినతే పవన్ కల్యాణ్ వారాహియాత్రకు సిద్ధమయ్యారు. 14వ  తేదీన అన్నవరంలో వారాహికి పూజలు చేసి యాత్ర ప్రారంభించబోతున్నారు. అదేరోజు ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా, ప్రత్తిపాడు నియోజకవర్గం, కత్తిపూడిలో ప్రారంభోత్సవ బహిరంగ సభలో  పవన్ ప్రసంగిస్తారని జనసేన ప్రకటించింది. 

పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర సందర్భంగా ఈ నెల  12న  పవన్ కల్యాణ్ అమరావతి చేరుకుంటారు. . అదే రోజున పవన్ సమక్షంలో ఆమంచి స్వాములు పార్టీలో జాయిన్ అయ్యే అవ‌కాశాలున్నాయి. పార్టీ ఆఫీసులో పదమూడో తేదీన యాగం నిర్వహిస్తారు.  యాత్ర ప్రారంభమైన  రోజే తొలి బహింగసభను నిర్వహించనున్నారు. జూన్ 14న ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా, ప్రత్తిపాడు నియోజకవర్గం, కత్తిపూడిలో ప్రారంభోత్సవ బహిరంగ సభలో  పవన్ ప్రసంగిస్తారని జనసేన ప్రకటించింది. 

జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఎన్నిక‌ల స‌మ‌ర శంఖం పూరించ‌నున్నారు. ప‌వ‌న్ క‌ళ్యాణ్ చేప‌ట్టనున్న వారాహి యాత్రకు ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. అధినేత చేయ‌నున్న ఈ యాత్రను విజ‌య‌వంతం చేసేందుకు జ‌న‌సైనికులు అహ‌ర్నిశ‌లు శ్రమిస్తున్నారు. ఈ నెల 14 నుంచి ప్రారంభం కానున్న వారాహి యాత్రలో ఉమ్మడి జిల్లాలో 8 నియోజకవర్గాలు క‌వ‌ర్ చేయ‌నున్నారు. ఐదు బహిరంగ సభలలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పాల్గొనున్నారు.

బహిరంగ సభలు ఎక్కడంటే... 

జూన్ 14న – ప్రత్తిపాడు కత్తిపూడి జంక్షన్ 
జూన్ 16న – పిఠాపురం ఉప్పాడ జంక్షన్ 
జూన్ 18న – కాకినాడ సర్పవరం జంక్షన్ 
జూన్ 21న – అమలాపురం గడియార స్తంభం సెంటర్ 
జూన్ 22న – రాజోలు మల్కిపురం సెంటర్ లో బ‌హ‌రంగ స‌భ‌లు జ‌ర‌గ‌నున్నాయి